Bhatti Vikramarka: 'ప్రభుత్వం కావాలనే గవర్నర్ ప్రసంగం లేకుండా చేసింది'

Bhatti Vikramarka: 'ప్రభుత్వం కావాలనే గవర్నర్ ప్రసంగం లేకుండా చేసింది'
Bhatti Vikramarka: రేపటి నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలను ప్రస్తావించనున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశంలో నాయకుల నుంచి తీసుకున్న అంశాలను క్రోడీకరించుకుని తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సమస్యలను లెవనెత్తడం జరుగుతుందని వెల్లడించారు. సంప్రదాయబద్దంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కొనసాగాల్సిన గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడం సరైందికాదని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కావాలనే అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుండా గవర్నర్ ప్రసంగం లేకుండా చేసిందంటున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రపై ఆలోచిస్తా..
బడ్జెట్ సమావేశాల వ్యూహాలపై పార్టీ నేతలతో చర్చిస్తున్నాం. జిల్లా అధ్యక్షులతో ప్రజా సమస్యలపై చర్చిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యల గురించి తెలుసుకుంటున్నాం. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఎక్కువగా ఉన్న సమస్యల గురించి అసెంబ్లీలోప్రస్తావిస్తాం. అవసరాన్నిబట్టి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రపై ఆలోచిస్తా. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు సరికాదు. ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించింది. తెరాస ప్రభుత్వం తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహించాలని చూస్తోంది. గవర్నర్ ప్రసంగం లేకపోవడం ప్రతిపక్షాల గొంతునొక్కడమే. సభ ప్రోరోగ్ జరగలేదని చెప్పడం సంప్రదాయానికి విరుద్ధం. ఇన్ని రోజులు ప్రోరోగ్ చేయకపోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే.
-భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇదీ చదవండి:
