పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన

author img

By

Published : Dec 24, 2019, 4:27 PM IST

BOOK FAIR

పుస్తక ప్రియులు ఎంతగానో ఎదురుచూసే హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ 33వ జాతీయ ప్రదర్శన జనవరి 1వరకు కొనసాగుతుంది. 330 స్టాళ్లతో లక్షలాది పుస్తకాలతో... ప్రాంగణం కళకళలాడుతోంది.

పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన

హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 33వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లాంఛనంగా ప్రారంభించారు. జనవరి 1వరకు కొనసాగుతుంది. ఈ ప్రదర్శనలో వివిధ ప్రచురణ సంస్థలకు చెందిన 330 స్టాళ్లు ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళం, ఆంగ్లంతో పాటు దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లోని రచనల్ని అందుబాటులో ఉంచారు. పిల్లల నుంచి పెద్దల వరకు అవసరమైన అన్ని పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి.

తొలిరోజే సందర్శకులు పెద్ద సంఖ్యలో బుక్ ఫెయిర్​ను సందర్శించారు. ఈ ప్రదర్శన కోసం ఎదురుచూస్తామని.. తమకు కావల్సిన పుస్తకాలు అన్నీ ఒకే దగ్గర దొరకడం... రాయితీలు ఇస్తుండటం వల్ల ఇక్కడికి వస్తున్నట్లు సందర్శకులు తెలిపారు.

కొత్త రచయితల పుస్తకాలను పరిచయం చేసుకునే అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాసిన రచనలతో ఓ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. రోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పిల్లలకు పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి: తీవ్రమైన ఆర్థిక మందగమనంలో భారత్: ఐఎంఎఫ్​

Intro:


Body:TG_HYD_00_24_ATTN_EB_BOOK_FAIR_PKG


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.