BJP ATTACK BC BHAVAN: బీసీ భవన్ ముట్టడికి భాజపా యత్నం.. అరెస్టు చేసిన పోలీసులు

author img

By

Published : Nov 24, 2021, 1:21 PM IST

BJP leaders tried to attack the BC Bhavan

హైదరాబాద్​లో బీసీ భవన్​ను(bjp attck to bc bhavan) ముట్టడికి భాజపా ఓబీసీ మోర్చా నాయకులు(bjp obc morcha leaders) యత్నించారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరుకు డిమాండ్ చేశారు. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయం(bc bhavan at masab tank) ముందు ఆందోళనకు దిగారు.

BJP attck to BC bhavan: హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని బీసీ భవన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భాజపా ఓబీసీ మోర్చా నాయకులు(BJP obc morcha leaders attack at bc bhavan) ఆందోళనకు దిగారు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు రుణాలకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ భవన్​ను ముట్టడికి పిలుపునిచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బీసీ భవన్‌(bc bhavan at in hyderabad) వద్ద భారీగా మోహరించారు.

బారికేడ్లు ఏర్పాటు

ఈ నేపథ్యంలో బీసీ భవన్‌ వద్దకు ఓబీసీ మోర్చా నేతలు(bjp obc morcha leaders) రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ధర్నాకు వస్తున్న ఓబీసీ మోర్చా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్‌ను మాసబ్‌ట్యాంక్‌ ప్రధాన కూడలి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి పోలీస్​స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలో పాల్గొన్న మహిళా కార్యకర్తలను కూడా పీఎస్​కు తరలించారు.

జీహెచ్​ఎంసీని ముట్టడించిన భాజపా కార్పొరేటర్లు

నిన్న హైదరాబాద్‌ జీహెచ్​ఎంసీ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. జీహెచ్​ఎంసీ కార్యాలయం వద్ద భాజపా కార్పొరేటర్లు ఆందోళనకు దిగడం ఆందోళనకు దారితీసింది. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ... మేయర్‌ ఛాంబర్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. పోలీసులు వారిని ఎక్కడిక్కడ అడ్డుకుని అరెస్ట్‌ చేయగా.. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేయటంతో ఉద్రిక్త వాతావరణం (BJP corporators besiege GHMC headquarters) ఏర్పడింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.