'మజ్లిస్‌తో కలిసి రా కేసీఆర్... బల ప్రదర్శనకు భాజపా సిద్ధం'

author img

By

Published : Sep 22, 2022, 9:23 PM IST

Updated : Sep 22, 2022, 10:46 PM IST

Etv Bharat

Bandi sanjay fires on KCR సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రికి మునుగోడులో ఓడిపోతాననే భయం పట్టుకుందని ఆరోపించారు. అందుకే నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారని అభిప్రాయపడ్డారు. కొత్త సచివాలయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేసి కుర్చీలో కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడే దళిత సమాజం విశ్వసిస్తోంది కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'మజ్లిస్‌తో కలిసి రా కేసీఆర్... బల ప్రదర్శనకు భాజపా సిద్ధం'

Bandi sanjay fires on KCR మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్‌కు ఓడిపోతానని తెలిసిపోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. నాలుగవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా... రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌ పేటలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న బండి సంజయ్ కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ నూతన సచివాలయానికి బీఆర్ అంబేడ్కర్‌కు పేరు పెట్టడంపై బండి విరుచుకుపడ్డారు. బీఆర్‌ అంబేడ్కర్‌కు గౌరవం ఇచ్చిన పార్టీ దళితుల్ని ఎలా మోసం చేసిందని ప్రశ్నించారు. పోడు భూముల పేరుతో గర్భిణీలపై లాఠీఛార్జ్‌ చేయించిన పార్టీ తెరాస అని గుర్తు చేశారు.

దళితుడిని సీఎం చేయాలి: ప్రజా సంగ్రామ యాత్రలను అడుగడుగునా అడ్డుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు వచ్చారని వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా భాజపానే అధికారంలోకి వస్తుందని కేసీఆర్‌ తెలుసుకోవాలని ఈ సభ ముఖంగా తెలిపారు. కొత్త సచివాలయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేసి కుర్చీలో కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడే దళిత సమాజం విశ్వసిస్తోంది కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

''దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పార్లమెంట్‌లో పెట్టింది భాజపా. అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చింది భాజపా. అంబేడ్కర్ చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజెప్పేలా పంచ తీర్ధాలను ఏర్పాటు చేసింది భాజపా. ఒవైసీకి ఎప్పుడు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, తెరాస కార్యకర్తలే కనబడుతున్నారు. మజ్లిస్‌ను కలుపుకొని రా కేసీఆర్... బల ప్రదర్శనకు భాజపా సిద్ధం.'' - బండి సంజయ్

ఏ పథకాలు రద్దు చేయం: తెలంగాణలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని బండి సంజయ్ అన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఏ పథకాలను రద్దు చేయమని వెల్లడించారు. భాజపా అధికారంలోకి వచ్చాక అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. మునుగోడులో భాజపా గెలవడమే లక్ష్యమని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది అని వ్యాఖ్యానించారు. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 15నుంచి ప్రారంభిస్తానని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే... ఇబ్రహీంపట్నం పేరును వీర పట్నంగా మారుస్తామని వివరించారు.

వాళ్లు జైలుకు వెళ్లే సమయం ఆగయా: ఈ సభకు ముఖ్యఅథితిగా వచ్చిన కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో పరివర్తన వచ్చిందని వెల్లడించారు. భాజపా అధికారంలోకి వచ్చి తీరుతుందని జోస్యం చెప్పారు. అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. నిజంగా తప్పు చేసిన వారు జైలుకు వెళ్లే సమయం వచ్చిందన్నారు.

ట్విటర్ పిట్ట చిలకపలుకులు: అంతకు ముందు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సైతం తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ట్విటర్ పిట్ట కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. రూ.36లక్షల కోట్లతో రైతు రుణమాఫీ చేసింది యూపీ సీఎం అని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులే ఉన్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ మనవడికి వయస్సు లేదు... లేకపోతే రాజ్యసభ సభ్యుడిని చేసేవారని సెటైర్ వేశారు. వరుణుడి కరుణతో తెలంగాణలో పంటలు బాగా పండాయన్న లక్ష్మణ్‌... కేసీఆర్ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ వనరులు తనఖా పెట్టి అప్పులు తెచ్చారని విమర్శించారు. దుబ్బాక, హుజూరాబాద్‌ లాగే మునుగోడులో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.

ఆ ఘనత మోదీ ప్రభుత్వానికే.. మునుగోడులో భాజపా విజయం కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి పార్టీని గెలిపించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్‌ రావు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను గౌరవించిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు.

ఇవీ చూడండి:

Last Updated :Sep 22, 2022, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.