Niranjan reddy on BJP and Congress: 'రాష్ట్ర రైతులను పట్టించుకోలేదని దుష్ప్రచారం'

author img

By

Published : Nov 22, 2021, 6:16 PM IST

Niranjan reddy on BJP and Congress

రైతు ఉద్యమంలో చనిపోయినవారికి పరిహారంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి(niranjan reddy on bjp and congress) వ్యాఖ్యానించారు. దిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేక ఉద్యమంలో 763 మంది మృతి చెందారని మంత్రి వెల్లడించారు. వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున సీఎం కేసీఆర్‌ పరిహారం ప్రకటించారన్నారు.

రాష్ట్ర రైతులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(niranjan reddy fire on congress bjp) మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అమరులైన అన్నదాతలకు సీఎం కేసీఆర్ రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారని తెలిపారు. దిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో 763 మంది మృతి చెందారని వెల్లడించారు.

కేసీఆర్ రైతు పక్షపాతి

రాష్ట్రంలో రైతు బీమా పథకం(insurance to farmers) కింద దాదాపు రూ.3,385 కోట్లు పంపిణీ చేశామని వెల్లడించారు. ఒక్కొక్కరికి 5 లక్షల ప్రకారం 67,699 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరిందని మంత్రి నిరంజన్ రెడ్డి(niranjan reddy on farmers) స్పష్టం చేశారు. రైతు బీమా, రైతుబంధు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని వ్యాఖ్యానించారు.

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం ప్రకటించిన సాయం చేయడం పట్ల భాజపా, కాంగ్రెస్ రాజకీయం చేయడం తగదన్నారు. తెలంగాణ రైతులను పట్టించుకోలేదని ప్రచారం చేయడం సిగ్గుచేటని మంత్రి ఆక్షేపించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. దేశంలోని కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతోందా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పాలనలో లాఠీ దెబ్బలు

దశాబ్దాలుగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి రైతులను వలసబాట పట్టించింది కాంగ్రెస్ నాయకులేనని మంత్రి(niranjan reddy on congress) విమర్శించారు. రాష్ట్రంలో అన్నదాతలకు ఇది స్వర్ణయుగమని మంత్రి కొనియాడారు. రైతుల సంక్షేమ కోసం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్‌ సరఫరా, రసాయన ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నామని మంత్రి చెప్పారు.

కాంగ్రెస్ పాలనలో సాగునీరు, ఎరువులు, విత్తనాలు కూడా దొరక్క రైతులు పోలీస్ స్టేషన్లలో పడిగాపులు కాసి లాఠీదెబ్బలు తిన్నారని ఆరోపించారు. అన్నదాత మరణిస్తే ఆ కుటుంబాలకు అండగా ఉండాలనే ముందుచూపుతో కేసీఆర్ రైతుబీమా ప్రవేశపెట్టారని చెప్పారు. 2021 - 22 సంవత్సరానికి 35.64 లక్షల మంది రైతులకు రైతుబీమా ప్రీమియం చెల్లించినట్లు తెలిపారు. ఏడాదికి దాదాపు రూ.60 వేలకోట్ల రూపాయలు వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.