బతుకమ్మ చీరలను కాలబెడితే కఠిన చర్యలు తప్పవు: ఎర్రబెల్లి

author img

By

Published : Sep 22, 2022, 10:50 PM IST

Updated : Sep 22, 2022, 10:55 PM IST

Errabelli Dayakar

Errabelli Dayakar respond on Bathukamma sarees: బతుకమ్మ చీరలను ఎవరైనా కాలబెడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులపై ప్రేమతో బతుకమ్మ చీరలను ఇస్తున్నారని.. వాటిని నచ్చితే తీసుకోవాలి లేకుంటే వదిలివేయాలని అంతే గాని లేనిపోని రాజకీయం చేయడం తగదని ఆయన హెచ్చరించారు.

Errabelli Dayakar respond on Bathukamma sarees: ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రతి అక్కచెల్లమ్మలకు ఒక అన్నగా, తమ్ముడుగా ఎంతో ప్రేమతో బతుకమ్మ చీరలు ఇస్తున్నారని దానిని కొందరు రాజకీయం చేసి వాటిని కాల్చే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది చాలా బాధకరమైన విషయని పంచాయితీ రాజ్​ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్​ అన్నారు. బతుకమ్మ చీరలను ఎవరైనా కాలబెడితే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆయన ఆదేశించారు. బతుకమ్మ చీరలు బహుమతిగా ఇస్తున్నామని వాటిని ధరతో పోల్చకూడదని ఆయన సూచించారు.

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దసరా, బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్​, మిగతా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బతుకమ్మ చీరలు నచ్చితే తీసుకోవాలి లేకుంటే వదిలివేయాలని అంతే గాని లేనిపోని రాజకీయం చేయడం తగదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఎమ్మెల్యేలు, వరంగల్‌ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు.

"కేసీఆర్​ ప్రతి అక్కచెల్లమ్మలకు ఒక అన్నగా, తమ్ముడుగా ఎంతో ప్రేమతో బతుకమ్మ చీరలు ఇస్తున్నారు. లేనిపోని రాజకీయం చేసి వాటిని కాల్చే ప్రయత్నం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. బతుకమ్మ చీరలు ఇష్టం లేని వాళ్లు తీసుకోకండి. అలాగే వారి ఇంట్లో తీసుకుంటున్న పింఛన్లు, రైతుబంధు మిగతా ప్రభుత్వ పథకాలు కూడా తీసుకోకండి."- ఎర్రబెల్లి దయాకర్​ రావు, పంచాయితీ రాజ్​ శాఖ మంత్రి.

బతుకమ్మ చీరెలను కాలబెడితే కఠిన చర్యలు తప్పవు: ఎర్రబెల్లి దయాకర్​

ఇవి చదవండి:

Last Updated :Sep 22, 2022, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.