ETV Bharat / state

సాహసం... క్రమశిక్షణ... కలబోతే ఎన్​సీసీ

ఎన్‌సీసీ శిక్షణ శిబిరాల్లో కెడెట్స్​కు ఇచ్చే శిక్షణ వారి జీవనగమనంలో ఎంతగానో ఉపయోగపడుతుందని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కమాండెంట్‌, ఎయిర్ మార్షల్ చలపతి పేర్కొన్నారు. పరేడ్ మైదానంలో జరిగిన 71వ ఎన్‌సీసీ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

హైదరాబాద్​లో 71వ ఎన్‌సీసీ డే వేడుకలు
author img

By

Published : November 24, 2019 at 7:26 PM IST

Choose ETV Bharat

సికింద్రాబాద్‌ పరేడ్ మైదానంలో జరిగిన 71వ ఎన్‌సీసీ డే వేడుకలు అలరించాయి. ఈ ఉత్సవాలకు దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కమాండెంట్‌ చలపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రమశిక్షణతో కూడుకున్న ఎన్‌సీసీ శిక్షణ కెడెట్లలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అంతకు ముందు కెడెట్లతో గౌరవవందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా దివ్యాంగుల కవాతు ఆకట్టుకుంది. యుద్ధ రంగంలో శత్రువులు చేసే బాంబుదాడులు, తూటాలకు నెరవకుండా శత్రువులను మట్టికరిపించే సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. గుర్రాల స్వారీ, సాహస సన్నివేశాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఔరా అనిపించారు.

హైదరాబాద్​లో 71వ ఎన్‌సీసీ డే వేడుకలు

ఇదీ చూడండి : 'స్వార్థ ప్రయోజనాల కోసమే అయోధ్యపై రివ్యూ పిటిషన్

TG_Hyd_29_24_NCC_Celebrations_AB_TS10007 Contributor: Vijay Kumar Script: Razaq ( ) ఎన్‌సీసీ శిక్షణ శిబిరాల్లో కెడెట్స్‌ ఇచ్చే శిక్షణ వారి జీవనగమనంలో ఎంతగానో ఉపయోగపడుతుందని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కమాండెంట్‌, ఎయిర్ మార్షల్ చలపతి అన్నారు. సికిందరాబాద్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ అధ్వర్యంలో 71వ ఎన్‌సీసీ డే వేడుకలకు ఎయిర్ మార్షల్ చలపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రమశిక్షణతో కూడుకున్న ఎన్‌సీసీ శిక్షణ కెడెట్లలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. శిక్షణ శిబిరంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఐకమత్యమే మహాబలమన్న సూత్రాన్ని అవలంబిస్తారని తెలిపారు. అంతకు ముందు ఎన్‌సీసీ కెడేట్లతో గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్,సికిందరాబాద్ హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కాకినాడ, కర్నూల్, భువనగిరి, నేత్రాలయ అంధుల విద్యాలయ గ్రూపులు చేసిన కవాతు ప్రదర్శన ఆకట్టుకుంది. యుద్దరంగంలో శత్రువులు చేసే బాంబుదాడులు, తూటాలకు వెవరకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తూ శత్రువు స్థావరాలను కొల్లగొట్టి శత్రువులను మట్టికరిపించే సన్నివేశాలను కెడేట్లు కళ్లకుకట్టినట్లు ప్రదర్శించారు. గుర్రాలపై స్వారీ చేయడంతో పాటు సాహస సన్నివేశాలు, సాంస్కృతిక ప్రదర్శించి ఆకట్టుకున్నారు. బైట్: చలపతి, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కమాండెంట్‌ ఎయిర్ చీఫ్‌ మార్షల్