ఈ ఏడాది మనమే నెం.1.. గ్రామీణ స్వచ్ఛ అవార్డుల్లో 13 మనవే..

author img

By

Published : Sep 22, 2022, 8:27 PM IST

Swachh Bharat Mission

Swachh Bharat Mission in Telangana state: గ్రామీణ స్వచ్ఛ భారత్​ మిషన్​లో అద్భుత ప్రదర్శనతో దేశంలోనే తెలంగాణ నెంబర్​ వన్​గా నిలిచింది. వివిధ కేటగిరుల్లో రాష్ట్రానికి 13 స్వచ్ఛ అవార్డులు వరించాయి. అక్టోబర్​ 2న స్వచ్ఛ భారత్​ దివాస్​ సందర్భంగా రాష్ట్రపతి ఆ అవార్డులను బహుకరించనున్నారు. అవార్డులు రావడంపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హర్షం వ్యక్తం చేశారు.

Swachh Bharat Mission in Telangana state: గ్రామీణ స్వచ్ఛభారత్‌ మిషన్‌ అవార్డుల్లో తెలంగాణ సత్తా చాటింది. రాష్ట్రానికి ఏకంగా 13 అవార్డులు దక్కించుకున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అక్టోబర్ 2 స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా ఆ అవార్డులన రాష్ట్రపతి బహుకరించనున్నారు. ఈ మేరకు ఓ లేఖను కేంద్ర అదనపు కార్యదర్శి, స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్ వికాస్ శీల్ రాష్ట్రానికి పంపారు.

జిల్లాల కేటగిరిలో వరుస రెండు, మూడు స్థానాలు మనవే: దేశానికి ఆదర్శ ప్రాయమైన ప్రదర్శనను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని ఆ లేఖలో ప్రశంసించారు. పెద్ద రాష్ట్రాల జాబితాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఇకపోతే జిల్లాల కేటగిరీలో దేశంలో రెండో స్థానంలో జగిత్యాల నిలవగా మూడో స్థానంలో నిజామాబాద్‌ నిలవడం విశేషం.

అవార్డులు, రికార్డులతో పాటు కేంద్రం నిధులు కూడా ఇవ్వాలి: తెలంగాణకు అవార్డులు రావడంపై గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వల్లే రాష్ట్రానికి అవార్డులు వచ్చాయన్నారు. ప్రశంసలు, అవార్డులు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో నిలిపేందుకు కృషిచేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అవార్డులు, రికార్డులతో పాటు కేంద్రం నిధులు కూడా ఇవ్వాలని కోరారు.

  • స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అవార్డుల్లో మరోసారి సత్తా చాటిన తెలంగాణ. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో వివిధ విభాగాల్లో రాష్ట్రానికి ఏకంగా 13 అవార్డులు. పెద్ద రాష్ట్రాల జాబితాలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన మన తెలంగాణ రాష్ట్రం.#TriumphantTelangana pic.twitter.com/d1n9B2VeHr

    — TRS Party (@trspartyonline) September 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.