Govt Report on loans: కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక.. పరిస్థితులపై ఆర్థికశాఖకు వివరణ

author img

By

Published : May 15, 2022, 4:51 AM IST

Updated : May 15, 2022, 5:37 AM IST

Govt Report on loans

Govt Report on loans: రుణాలకు సంబంధించిన అభ్యంతరాలను నివృత్తి చేయడంతో పాటు ఆవశ్యకతను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. అప్పులకు సంబంధించిన అన్ని అంశాలు సహా కేంద్ర ఆర్థిక శాఖ సమావేశంలో చెప్పిన అంశాలను నివేదించారు. కొత్త రాష్ట్రం, ప్రజల ఆకాంక్షలు, ప్రత్యేక పరిస్థితులు సహా ఆర్థిక సామర్థ్యం లాంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

Govt Report on loans: అప్పులకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ లేవనెత్తిన అభ్యంతరాలతో పాటు వాదనలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. వివిధ కార్పోరేషన్ల కింద రుణాలు తీసుకొని చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటి ప్రయోజనాలు, అవసరాలు, ప్రస్తుత స్థితిని కేంద్రానికి ప్రత్యేకంగా నివేదించారు. రాష్ట్ర అప్పులకు సంబంధించిన అన్ని అంశాలను ఇటీవల జరిగిన దృశ్యమాధ్యమ సమీక్షలో కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర అధికారులు వివరించారు. వాటన్నింటినీ తమకు లిఖిత పూర్వకంగా పంపాలని, పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి తెలిపారు. అందుకు అనుగుణంగా కేంద్రానికి రాష్ట్ర ఆర్థిక శాఖ నివేదిక పంపింది. అప్పులకు సంబంధించిన అన్ని వివరాలను గణాంకాలతో సహా నివేదించినట్లు తెలిసింది. ఎఫ్​ఆర్​బీఎమ్​ పరిధికి లోబడి తీసుకున్న రుణాలతో పాటు బడ్జెటేతర అప్పుల వివరాలను పంపారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాల కోసం ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు, చెల్లింపులకు సంబంధించి బడ్జెట్‌లో చేసిన కేటాయింపులను నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. దాంతో పాటు దృశ్యమాధ్యమ సమీక్షలో ప్రస్తావించిన అంశాలు, రాష్ట్ర వాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక.. పరిస్థితులపై ఆర్థికశాఖకు వివరణ

కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు, వాటిని తీర్చేందుకు అవసమయ్యే నిధులు, రాష్ట్ర అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు, తదితర అంశాలను పేర్కొన్నారు. ప్రత్యేకించి కేంద్రం అభ్యంతరం చెబుతున్న బడ్జెట్ వెలుపలి రుణాలు, వాటితో చేపట్టిన ప్రాజెక్టులు, కార్యక్రమాలు, వాటి ఫలితాలను ప్రస్తావించినట్లు సమాచారం. అప్పుల ద్వారా తీసుకున్న మొత్తాన్ని మూలధన వ్యయంగానే ఉపయోగిస్తున్నామని, ఆయా ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. ప్రాజెక్టుల పూర్తితో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, వాటి అవసరాన్ని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ఎఫ్​ఆర్​బీఎమ్ చట్టాల్లోని నిబంధనలు, అంశాలతో పాటు 15 వ ఆర్థిక సంఘం నివేదికలో పేర్కొన్న విషయాలను నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. రుణాల ఆవశ్యకతను వివరిస్తూనే... రాష్ట్ర ఆర్థిక సామర్థ్యం తదితర అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అప్పులకు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వచ్చినా... తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణకు అనుగుణంగా నివేదికలో వివిధ అంశాలను పొందుపరచినట్లు సమాచారం.

ఇవీ చూడండి: 'తెలంగాణలో నిజాం ప్రభువును గద్దె దించేందుకు సిద్ధమవ్వండి..'

బాలికపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు.. డ్రైవర్​కు నిప్పంటించిన స్థానికులు

Last Updated :May 15, 2022, 5:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.