BHADRACHALAM: గోదావరి వరద తగ్గింది... అంతా బురదమయమైంది

author img

By

Published : Aug 27, 2021, 2:35 PM IST

flood-is-receded

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా భద్రాచలం గోదావరికి వచ్చిన వరద ఉద్ధృతి కాస్త తగ్గింది. రెండు రోజులుగా ప్రవాహం తగ్గడంతో... చాలా రోజులుగా నీటిలోనే ఉన్న స్నానఘట్టాల ప్రాంతం కనిపించింది.

కొన్నిరోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో గోదావరికి నీటి ఉద్ధృతి పెరిగి... భద్రాచలంలోని స్నానఘట్టాల ప్రాంతమంతా నీట మునిగిపోయింది. గురువారం నుంచి వరద ఉద్ధృతి ఒక్కసారిగా తగ్గుతూ ఉంది. రెండు రోజుల క్రితం 30 అడుగుల మేర ఉన్న నీటిమట్టం... నిన్నటి నుంచి తగ్గుముఖం పట్టి నేడు 17.4 అడుగుల వద్ద ప్రవహిస్తోంది.

సంబంధిత శాఖ బురదను శుభ్రం చేయకపోవటంతో గోదావరి వద్ద స్నానమాచరించడానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. బురద కారణంగా జారి కిందపడుతున్నారు. వెంటనే ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయించాలని భక్తులు కోరుతున్నారు. అసలే ఇది శ్రావణమాసమని... ఉదయాన్నే ఆలయానికి వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు వస్తారని తెలిపారు. తెల్లవారుజామున... చీకటి ఉన్న సమయంలో కాలు జారి పడిపోతే ప్రమాదమని... అలాంటి ఘటనలు జరగముందే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: Afghan crisis: అఫ్గాన్​ నుంచి ప్రజల తరలింపు నిలిపేసిన దేశాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.