singareni bonus 2021: సింగరేణి కార్మికులకు దసరా కానుక.. లాభాల్లో 29 శాతం వాటా బోనస్‌

author img

By

Published : Oct 5, 2021, 8:51 PM IST

Updated : Oct 5, 2021, 10:07 PM IST

cm-kcr-review-on-singareni-workers-bonus

20:48 October 05

సింగరేణి కార్యకలాపాలు మరింత విస్తరించాలి: సీఎం కేసీఆర్‌

పండుగ పూట సింగరేణి కార్మికులకు ప్రభుత్వం తియ్యటి ముచ్చట చెప్పింది. పండుగ బోనస్​ను ప్రకటించి.. కార్మికుల్లోల పండుగ ఉత్సాహాన్ని నింపింది. ప్రతీ ఏడాది.. సంస్థ లాభాల్లో కొంత వాటాను బోనస్​ రూపంలో కార్మికులకు అందించే ప్రభుత్వం.. ఈసారి కూడా అలాగే చేసింది. ఈసారి గతేడాది కంటే ఒక శాతం పెంచుతూ సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి కార్మికులకు ఈసారి ఏకంగా లాభాల్లో 29 శాతం వాటా బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించారు.  బోనస్‌ను దసరాకు ముందే చెల్లించాలని సింగరేణి సీఎండీకి ఆదేశాలు జారీ చేశారు.  

సింగరేణి ఇంకా విస్తరించాలి

"సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కార్మికుల భవిష్యత్‌ దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరముంది. బొగ్గుతవ్వకంతో పాటు  ఇసుక, ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరముంది. బొగ్గుగని, విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే ఉన్నతస్థానంలో ఉన్నాం. సంస్థను అగ్రగామిగా నిలపడంలో కార్మికులదే గొప్ప కృషి. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తుండటం శోచనీయం. విశ్రాంత సిబ్బందికి కేంద్రం నుంచి పింఛను రూ.2 వేల లోపు వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలి. విశ్రాంత కార్మికులకు చేయగల సాయంపై అధ్యయనం చేయాలి. అధికారులు అధ్యయనం చేసిన నివేదిక ఇవ్వాలి."- సీఎం కేసీఆర్

సీఎంకు కృతజ్ఞతలు..

సీఎం కేసీఆర్​కు సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. పండుగ సందర్భంగా బోనస్​ ప్రకటించినందుకు గానూ..  సీఎం కేసీఆర్‌కు టీజీబీకేఎస్ నేతలు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదీ చూడండి:

Last Updated :Oct 5, 2021, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.