కోర్టులో ఉద్యోగాల పేరుతో రూ.1.90 కోట్లు కాజేశారు..  బాధితులు చితక్కొట్టారు!

author img

By

Published : Aug 18, 2021, 10:40 AM IST

cheaters got punishment

కోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు తీసుకున్న దంపతులకు బాధితులు దేహశుద్ధి చేశారు. చాలా రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారని.. డబ్బులు అడిగితే వాయిదాలు వేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసునమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో డబ్బులు వసూలుచేసిన దంపతులకు బాధితులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరింది.

పాల్వంచ వికలాంగుల కాలనీకి చెందిన మేఘన సరస్వతి తన భర్త రాంబాబుతో కలిసి 2019లో కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు వసూలుచేసింది. ఇలా సుమారు 91 మంది నుంచి.. కోటి 90 లక్షలు వసూలుచేసినట్లు బాధితులు తెలిపారు. తీరా మెరిట్​ జాబితాలో పేరులేకపోవడం వల్ల మోసపోయామని గ్రహించిన బాధితులు.. గత నెల 26న పాల్వంచ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదుచేశారు.

అప్పటి నుంచి తమకు దొరక్కకుండా మేఘన, రాంబాబు తప్పించుకొని తిరుగుతున్నారని బాధితులు తెలిపారు. మంగళవారం మాటువేసి.. వారిని నిలదీసినట్లు చెప్పారు. మాటామాట పెరిగి దంపతులిద్దరికీ బాధితులు దేహశుద్ధి చేశారు. చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు వచ్చి వారిని కాపాడారు. అంతలోనే మేఘనకు ఫిట్స్​ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు... వారి వాహనంలోనే పాల్వంచ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం.. దేహశుద్ధి చేసిన బాధితులు

కోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే మేఘనకు రూ.19 లక్షలు చెల్లించాం. మా బంధువులు, స్నేహితులు నన్ను నమ్మి.. పాల్వంచ, అశ్వారావుపేట వెళ్లి డబ్బులు కట్టారు. తీరా ఉద్యోగాలు ఇప్పించలేకపోయారు. తర్వాత డబ్బులు తిరిగిస్తానని చెప్పి.. వాయిదా వేశారు. ఇంటికెళ్తే కోర్టు నోటీసులు ఇచ్చారు. బెదిరింపులకు పాల్పడ్డారు. మాకు న్యాయం చేయాలి.

-కేశవులు, బాధితుడు, అశ్వారావుపేట

ఇదీచూడండి: GANDHI HOSPITAL RAPE CASE: 'గాంధీ'లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. అక్కడ ప్రతిదీ అనుమానమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.