No Trains For Adilabad : సరుకుల రవాణాకు మార్గం లేదు.. అధికారుల నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం
Published: May 15, 2023, 10:59 PM


No Trains For Adilabad : సరుకుల రవాణాకు మార్గం లేదు.. అధికారుల నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం
Published: May 15, 2023, 10:59 PM
No proper Route for Adilabad Railway Station : బీజేపీ అభ్యర్థిని పార్లమెంటుకు, బీఆర్ఎస్ అభ్యర్థులను శాసనసభకు పంపించిన ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకం.. ప్రధాన రాజకీయ పక్షాలకు వెన్నుదన్నుగానే నిలిచింది. ప్రజల ఓట్లతో చట్టసభలకు ఎన్నికైన నేతలు మాత్రం జిల్లాలోని రైలు మార్గాలను పరిగణలోకి తీసుకోవడంలేదు. అపారమైన ప్రకృతి సంపదకు నెలవైనా.. సరైనా రవాణా సౌకర్యంలేక ప్రగతికి నోచుకోవడం లేదు.
No proper Route for Adilabad Railway Station : ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణకు ఆదిలాబాద్ జిల్లా తలమానికంగా ఉంది. ఉత్తర, దక్షిణ భారతానికి అనుసంధానమైన వారధిగా నిలుస్తోంది. విమానాలు, రైళ్ల రాకపోకలకు అన్ని విధాలా అనువుగానే ఉన్నా.. రైలు కూతలు వినిపించడం లేదు. విమానాల రాక కనిపించడం లేదు.
నిజాం కాలంలోనే ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వెళ్లడానికి వచ్చే విమానాలు ఆదిలాబాద్ విమానాశ్రయంలో ఆగేవి. ఆదిలాబాద్ నుంచి ఔరంగాబాద్‌కు, ఆదిలాబాద్ నుంచి పూర్ణ వరకు మీటర్ గేజ్‌పై ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. 23 ఏళ్ల కింద దాన్ని బ్రాడ్‌గేజ్‌గా మార్చినా రైళ్ల సంఖ్య మాత్రం పెరగలేదు. ఇప్పటికీ కేవలం నాలుగుకు మించి రైళ్లకు ఆదిలాబాద్ జిల్లా నోచుకోవడం లేదు.
రైలు మార్గం ఉంటే.. అభివృద్ధి చెందే అవకాశం ఉంది: అపారమైన సున్నపురాయి, మాంగనీసు, బొగ్గునిక్షేపాలతో పాటు పత్తి, సోయా, కూరగాయల సాగుకు ఆదిలాబాద్ జిల్లా ప్రసిద్ధి. ఇక్కడి పత్తి ఖండాంతర ఖ్యాతి గడించింది. ప్రస్తుతం ఉన్న 44వ నంబర్ జాతీయ రహదారికి ఆనుసంధానంగా రైలు మార్గం ఉంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. హైదరాబాద్‌కు నేరుగ వెళ్లేందుకు ఆదిలాబాద్ నుంచి వయా నిర్మల్ మీదుగా ఆర్మూర్‌కు రైలు మార్గానికి ఏళ్లుగా చేస్తున్న సర్వేలన్నీ ప్రతిపాదనల దశ దాటడం లేదు.
సరుకుల రవాణాకు సరైన మార్గం లేదు: ఆదిలాబాద్‌లో ఉన్న రైల్వేస్టేషన్‌కు అనుసంధానంగా సరకుల రవాణాకు సరైన మార్గం లేదు. వందలాది ఎకరాల రైల్వే భూమి అందుబాటులో ఉన్నప్పటికీ అధికారులు, నేతల నిర్లక్ష్యమే ప్రధాన శాపంగా పరిణమిస్తోంది. చివరికి ఆదిలాబాద్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జిల నిర్మాణాల కోసం ఏళ్లుగా ఉన్న డిమాండ్ నెరవేరని కలగానే మిగలడం జిల్లా ప్రజలను ఆవేదనకు గురిచేస్తోంది.
'ఇక్కడ ఆదిలాబాద్‌లో ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే.. తెలంగాణలో మనం లాస్ట్‌లో ఉన్నాం అంటే అక్కడే ఉంచేశారు. కిసాన్ రైలు అంటే రైతులు పండించిన కూరగాయలు, పండ్లు ఆదిలాబాద్ నుంచి నాగపూర్ వరకు తీసుకెళ్లి వారు ఎక్కడైనా అమ్మొచ్చు. ట్రైన్ మీదేనే మార్కెట్‌కి వెళ్లొచ్చు. అన్ని సౌకర్యాలు ఉన్న ఆదిలాబాద్‌ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు'. -స్థానికులు
ఇవీ చదవండి:
