Miserable condition: ఓవైపు పురిటి నొప్పులు.. మరోవైపు పొంగుతున్న వాగు!

author img

By

Published : Aug 22, 2021, 11:56 AM IST

Updated : Aug 22, 2021, 1:18 PM IST

Miserable condition, pregnant woman problems

నిండు గర్భిణీ ఓవైపు ప్రసవ వేదన అనుభవిస్తూనే... మరోవైపు పొంగుతున్న వాగును ఎడ్లబండిపై దాటాల్సిన దయనీయ పరిస్థితి(Miserable condition) ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా రాజుల తండాకు చెందిన ఓ మహిల పురిటి నొప్పులను(labour pains) పంటిబిగువున బిగబట్టి వాగు దాటారు. సరైన రోడ్డు లేక గర్భిణీలకు దినదినగండంగా ఉందని స్థానికులు వాపోయారు.

నెలలు నిండిన ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి బయల్దేరిన వారికి వాగు రూపంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. చేసేది లేక పురిటి నొప్పులను(labour pains) పెదవిచాటున అదిమిపెడుతూ ఎడ్లబండి మీద పొంగుతున్న వాగు దాటాల్సిన దయనీయ పరిస్థితి(Miserable condition) ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం రాజులతండాకు చెందిన ఓ నిండు గర్భిణీ ప్రసవ వేదన ఇది.

గ్రామానికి చెందిన సరితకు శనివారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. స్థానికుల సాయంతో ఆమెను ఎడ్లబండిలో వాగు దాటించి, అక్కడి నుంచి ఆటోలో నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చివరకు ఆమెను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు.

ఏళ్లు గడిచినా అక్కడి ప్రజలకు కనీసం రోడ్డు సౌకర్యం(road facility)లేదని స్థానికులు వాపోతున్నారు. సరైన రోడ్డు లేక గర్భిణీలకు దినదినగండంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎడ్లబండ్లతోనే కాలం వెల్లదీస్తున్నామని అన్నారు. మరోవైపు ఆదివారం కూడా ఆస్పత్రిలో ఆమెకు బెడ్ సౌకర్యం కల్పించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పురిటి నొప్పులతో గర్భిణీ వేదన

ఇదీ చదవండి: Inhuman Incident: పొత్తిళ్లలో అదుముకోవాల్సిన తల్లే.. పసికందును పారేయాలనుకుంది!

Last Updated :Aug 22, 2021, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.