Ktr Appraised sarpanch: అభివృద్ధికి ముఖచిత్రం ముఖరా(కే)..

author img

By

Published : Jul 5, 2022, 8:00 PM IST

Ktr

Ktr Appraised sarpanch: తెలంగాణ అభివృద్ధికి ముఖరాకే గ్రామమే ముఖ చిత్రమని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమం- ప్రతి ఇంటికీ కేసీఆర్ పేరుతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కే) గ్రామంలో చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

Ktr Appraised sarpanch: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. వాటిని ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకువెళ్లాలని సూచించారు. ప్రతి ఇంటికీ సంక్షేమం- ప్రతి ఇంటికీ కేసీఆర్ పేరుతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కే) గ్రామంలో చేపట్టిన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

సర్పంచ్​ను మెచ్చుకున్న మంత్రి: ముఖరా(కే) గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి చేస్తున్న వినూత్న ప్రచారం బాగుందని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం పొందిన లబ్ధిదారుల ఇంటి ముందు ఆ వివరాలతో కూడిన పోస్టర్లను ఉంచడం అభినందనీయమని కొనియాడారు. ఇప్పటి వరకు ముఖరా(కే) అభివృద్ధికి సుమారు 34 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిన వివరాలను గ్రామంలో ఫ్లెక్సీలా ఉంచడం ప్రశంసనీయమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని మిగతా గ్రామపంచాయతీల్లోనూ ముఖరా(కే) తరహాలో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

పల్లెప్రగతి కార్యక్రమంతో ముఖరా(కే)ను జాతీయస్థాయిలో ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దిన సర్పంచ్ గాడ్గే మీనాక్షిని మంత్రి కేటీఆర్ అభినందించారు. తడిచెత్తతో గ్రామపంచాయతీకి ఆరు లక్షల రూపాయలు ఆదాయంగా రావడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని మిగతా గ్రామాలు ముఖరా(కే)ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. గ్రామాభివృద్ధికి మరింత తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం తమకోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తుందా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని సర్పంచ్ గాడ్గే మీనాక్షి చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తమ ప్రయత్నాన్ని కేటీఆర్ అభినందించిడం తమకు స్పూర్తినిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం, మంత్రి కేటీఆర్ పోత్సాహంతో ముఖరా(కే)ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని సర్పంచ్ మీనాక్షి తెలిపారు.

కేటీఆర్​కు ట్వీట్.. వెంటనే రియాక్షన్:

  • పల్లె ప్రగతితో ముఖ్రా కె గ్రామం అందరికీ ఆదర్శం - మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ @KTRTRS.

    ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండ‌లంలోని ముఖ్రా కె గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన గ్రామ సర్పంచ్‌ గాడ్గె మినాక్షి గారిని అభినందించిన మంత్రి కేటీఆర్.#PallePragathi

    1/3 pic.twitter.com/VbG1E2Oj7Z

    — TRS Party (@trspartyonline) July 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తమ ప్రాంతంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయని తక్షణమే వైద్య సహాయం అందించాలని ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్​కు ట్వీట్​ చేశారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించారు. హైదరాబాద్​లోని హెచ్​ఎంటీ స్వర్ణపురి కాలనీ పక్కనే ఉన్న శిల్పా లేఅవుట్​లో పలువురుకి విష జ్వరాలు సోకాయని వివరిస్తూ కేవీఎస్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మంత్రికి ట్విట్టర్​ ద్వారా విన్నవించారు.

డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఇక్కడ పిల్లలు, పెద్దలు తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి శేరిలింగంపల్లి వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణం శిల్పా లే అవుట్​లో వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. వెంటనే శేరిలింగంపల్లి యూపీహెచ్​సీ వైద్య బృందం బాధితులకు పరీక్షలు నిర్వహించి మందులను అందించారు. తమ ట్వీట్​కి తక్షణమే స్పందించి వైద్యులను పంపించిన మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి: ఇంటర్‌ స్థాయికి గురుకులాలు.. సీఎం కేసీఆర్ సమీక్ష

నదిలో బైక్​ నడిపిన యువకుడు.. అయోధ్య వాసుల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.