ఆదిలాబాద్ కుర్రాడి ఘనత .. దిల్లీలో రిథమిక్ యోగ ప్రదర్శనకు ఎంపిక

author img

By

Published : Jul 25, 2022, 4:11 PM IST

రిథమిక్ యోగా

Rhythmic yoga: దిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 75వ స్వాతంత్య్ర వేడుకల్లో.. రిథమిక్ యోగా ప్రదర్శనకు ఆదిలాబాద్‌ కుర్రాడు ఎంపికయ్యాడు. ఎక్‌ భారత్ శ్రేష్ఠ్ భారత్ నినాదంతో తొలిసారిగా రిథమిక్ యోగాను పరేడ్‌లో చేర్చారు. రాష్ట్రం నుంచి ఈ ప్రదర్శనకు ఒక్కరే ఎంపికయ్యారు.

ఆదిలాబాద్ కుర్రాడి ఘనత .. దిల్లీలో రిథమిక్ యోగ ప్రదర్శనకు ఎంపిక

Rhythmic yoga: దిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 75వ స్వాతంత్య్ర వేడుకల్లో రిథమిక్ యోగా ప్రదర్శనకు ఆదిలాబాద్‌ కుర్రాడు ఎంపికయ్యాడు. ఒల్లును విల్లులా వంచుతూ.. అతి కష్టమైన ఆసనాలను సైతం అత్యంత సులువుగా వేస్తున్న ఈ కుర్రాడి పేరు ప్రజాత్‌సింగ్‌చౌహాన్‌ . ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నాడు. తొమ్మిదో తరగతి నుంచి యోగాసనాల్లో శిక్షణ పొందుతున్నాడు.

యోగాలో తన ప్రతిభతో ప్రజాత్‌సింగ్‌చౌహాన్‌ అరుదైన అవకాశం అందుకున్నాడు. ఈ ఏడాది జూన్‌లో ఏపీలోని కాకినాడలో జరిగిన ఎన్​సీసీ వార్షిక శిక్షణ శిబిరానికి హాజరైన ప్రజాత్​సింగ్ రిథమిక్ యోగాను ప్రదర్శించాడు. యువకుడి ప్రతిభ మెచ్చిన అధికారులు 75 స్వాతంత్య్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో రిథమిక్‌ యోగాను ప్రదర్శించే అవకాశం ఇచ్చారు. ఈ ప్రదర్శనకు రాష్ట్రం నుంచి తాను ఒక్కడినే ఎంపిక కావడం గర్వంగా ఉందని చెప్పాడు. తమ వద్ద శిక్షణ తీసుకున్న విద్యార్థి జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపిక కావడంపై శ్రీ పతంజలి యోగ కేంద్రం గురువులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

"ఈ ఏడాది జూన్‌లో ఏపీలోని కాకినాడలో జరిగిన ఎన్​సీసీ వార్షిక శిక్షణ శిబిరానికి హాజరయ్యాను. అక్కడ మంచి ప్రతిభతో 8వ స్థానం దక్కించుకున్నాను. దీల్లిలో నిర్వహించే 75వ స్వాతంత్య్ర వేడుకల్లో రిథమిక్‌ యోగాను ప్రదర్శించే అవకాశం వచ్చింది. - ప్రజాత్‌సింగ్‌చౌహాన్‌ యోగా విద్యార్థి

"మా దగ్గర శిక్షణ తీసుకున్న విద్యార్థి దీల్లిలో నిర్వహించే 75వ స్వాతంత్య్ర వేడుకల్లో రిథమిక్‌ యోగాను ప్రదర్శించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. అందుకు ప్రజాత్‌సింగ్‌చౌహాన్‌ను అభినందిస్తున్నాను". పి.తిరుపతిరెడ్డి, యోగా గురువు

ఇవీ చదవండి: LEOPARDS VIDEO VIRAL : అక్కన్నపేటలో చిరుతపులుల సంచారం

వేధింపులు భరించలేక దళిత విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్​లో విగతజీవిగా మరొకరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.