హాకీకి ఒడిశా అండ.. స్పాన్సర్​గా మరో పదేళ్లు

author img

By

Published : Aug 17, 2021, 10:20 PM IST

Updated : Aug 17, 2021, 10:42 PM IST

hockey

టోక్యో ఒలింపిక్స్​ తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన భారత పురుషుల, మహిళల హాకీ జట్లను ఘనంగా సన్మానించింది ఒడిశా ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇరుజట్లకు మరో పదేళ్ల పాటు స్పాన్సర్​షిప్​ ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం నవీన్​ పట్నాయక్​.

భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు మరోసారి అండగా నిలిచేందుకు సిద్ధమైంది ఒడిశా ప్రభుత్వం. ఇరు జట్లకు మరో పదేళ్ల పాటు స్పాన్సర్​షిప్​ను కొనసాగించనున్నట్లు ప్రకటించింది.

టోక్యో ఒలింపిక్స్​ తర్వాత తొలిసారి తమ రాష్ట్రానికి వచ్చిన హాకీ జట్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది ఒడిశా ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ఇరుజట్ల సారథులు రాణి రాంపాల్​, మన్​ ప్రీత్​ సింగ్​ను సత్కరించిన ఆ రాష్ట్ర సీఎం నవీన్​ పట్నాయక్​.. తమ స్పాన్సర్​షిప్​ నిర్ణయాన్ని ప్రకటించారు.

టోక్యో ఒలింపిక్స్​లో ​అద్భుత ప్రదర్శన చేసిన పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్​లో చరిత్ర సృష్టించింది. కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 41ఏళ్ల తర్వాత హాకీలో భారత్​ పతకం రావడం ఇదే తొలిసారి. అలానే మహిళల హాకీ జట్టు విశ్వక్రీడల చరిత్రలో తొలిసారి సెమీఫైనల్​కు వెళ్లింది. ఈ మ్యాచ్​లో అద్భుత పోరాటం చేసినప్పటికీ గెలవలేకపోయింది.

ఇదీచూడండి: ఒలింపిక్స్​లో పతకం.. ప్రభుత్వ పాఠశాల పేరు మార్పు

Last Updated :Aug 17, 2021, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.