ఉబెర్​ కప్ గ్రూప్​ డీ చివరి మ్యాచ్​లో భారత్​ ఓటమి​

author img

By

Published : May 11, 2022, 3:51 PM IST

uber-cup-2022-india

ఉబెర్​ కప్ గ్రూప్ డీ చివరి మ్యాచ్​లో భారత్​ ఓడిపోయింది. పీవీ సింధు సహా భారత షట్లర్లు దక్షిణ కొరియా ఆటగాళ్ల చేతిలో ఓడిపోయారు. అయితే ఇది నామమాత్రపు మ్యాచే. మొదటి రెండు మ్యాచుల్లో గెలిచి భారత జట్టు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్​ చేరింది.

Uber cup 2022: ఉబెర్​ కప్​ గ్రూప్​ పోటీల్లో రెండు వరుస విజయాలతో జోరుమీదున్న భారత్​కు షాక్ తగిలింది. చివరి మ్యాచ్​లో దక్షిణ కొరియా చేతిలో 5-0 తేడాతో భారత జట్టు ఓటమిపాలైంది. గ్రూప్​ డీ ఆఖరు మ్యాచ్​లో భారత దిగ్గజ షట్లర్, ప్రపంచ నెం.7 పీవీ సింధు.. అన్​ సే యంగ్​ చేతిలో 15-21, 14-21 తేడాతో వరుస సెట్లలో ఓడింది. 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్​లో సింధుపై యంగ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

Badminton uber cup 2022: రెండో మ్యాచ్​లో మహిళల డబుల్స్ జోడి శృతి మిశ్ర, సిమ్రన్ సింఘ్రి.. సీ సో హీ షిన్, సుయెంగ్​ చాన్ చేతిలో 13-21, 12-21 తేడాతో ఓడిపోయారు. మూడో మ్యాచ్లోనూ 10-21, 10-21 తేడాతో ఓటమి చవిచూశారు.

ఆ తర్వాత జరిగిన మ్యాచ్​లో తనీష క్రాస్టో, ట్రీజ జోల్లీ జోడి కూడా కిమ్​ హుయే జియాంగ్​, కాంగ్ హీ యాంగ్​ చేతిలో 14-21, 11-21తేడాతో ఓడింది. ఇక చివరి మ్యాచ్​లో అష్మితా చాలిహా, సిమ్​ యూ జిన్​తో 18-21, 17-21 తేడాతో పోరాడి ఓడింది. దీంతో భారత్​ 5-0 తేడాతో పరాభవం చవిచూసింది.

బ్యాంకాక్​ వేదికగా జరగుతున్న ఉబెర్​ కప్​లో భారత జట్టు మొదటి రెండు మ్యాచుల్లో కెనడా, అమెరికాపై ఘన విజయం సాధించి ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్​ చేరింది. గ్రూప్​ దశలో నామమాత్రము చివరి మ్యాచ్​లో మాత్రం ఓడిపోయింది.

ఇదీ చదవండి: IPL 2022: అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్​.. ఈ సారి అద్భుతాలు సృష్టించారుగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.