ఉబెర్​ కప్ నుంచి సింధు టీం ఔట్​.. క్వార్టర్​ ఫైనల్స్​లో ఓటమి

author img

By

Published : May 12, 2022, 5:08 PM IST

Updated : May 12, 2022, 5:19 PM IST

sindhu-led-india-crash-out-of-uber-cup

Uber Cup 2022: ఉబెర్​ కప్​ నుంచి భారత జట్టు నిష్క్రమించింది. క్వార్టర్​ ఫైనల్స్​లో సింధు సారథ్యంలోని మహిళల జట్టు థాయ్​లాండ్​ చేతిలో పరాజయం చవిచూసింది.

Uber cup quarter finals: ఉబెర్ కప్​ నుంచి భారత మహిళ జట్టు వెనుదిరిగింది. ఒలింపిక్ పతక విజేత, ప్రపంచ నం.7 పీవీ సింధు సారథ్యంలోని మహిళల జట్టు థాయ్​లాండ్ చేతిలో 0-3 తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్​లో సింధు.. ప్రపంచ నం.8 ర్యాంకర్​ రాచనోక్​ ఇంటనాన్​ చేతిలో 21-18 17-21 12-21 తేడాతో పోరాడి పరాజయం పొందింది. ఈ మ్యాచ్ 59 నిమిషాల పాటు సాగింది. ఇంటనాన్​తో ఇప్పటివరకు 11 మ్యాచ్​లు ఆడిన సింధు.. నాలుగు మ్యాచుల్లోనే విజయం సాధించింది. 7 విజయాలతో ఇంటనాన్ పైచేయి సాధించింది.

Badminton News: అనంతరం మహిళల డబుల్స్​ మ్యాచ్​లో శ్రుతి మిశ్ర, సిమ్రన్ సింఘి జోడి 16-21 13-21 తేడాతో జాంగ్​కోల్పాన్,​ రవిండ ప్రజోంగ్​జాయ్ చేతిలో ఓడిపోయింది. మూడో మ్యాచ్​లో ఆకర్షి కశ్యప్​ కూడా 16-21 11-21 తేడాతో చోచువాంగ్ చేతిలో పరాజయం పొందింది. దీంతో థాయ్​లాండ్ 3-0 తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఫలితంగా మరో రెండు మ్యాచ్​లు ఆడాల్సిన అవసరం లేకుండానే థాయ్​లాండ్​ సెమీస్​లోకి దూసుకెళ్లింది.

PV Sindhu News: బుధవారం జరిగిన నామమాత్రపు గ్రూప్​ డీ చివరి మ్యాచ్​లో కూడా సింధు జట్టు కొరియా చేతిలో 0-5తేడాతో ఓడిపోయింది. అయితే అప్పటికే రెండు విజయాలతో క్వార్టర్ పైనల్స్ చేరడం వల్ల ఫలితంపై ప్రభావం లేదు. కానీ గురువారం జరిగిన క్వార్టర్​ ఫైనల్స్​లో కూడా భారత జట్టు పరాజయ పరంపర కొనసాగించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఇవాళే జరిగే థామస్ కప్​ క్వార్టర్ ఫైనల్స్​లో భారత పురుషుల జట్టు మలేషియాతో తలపడనుంది.

ఇదీ చదవండి: 100 మీటర్ల హర్డిల్స్​లో 'తెలుగమ్మాయి' జాతీయ రికార్డు

Last Updated :May 12, 2022, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.