పారాలింపిక్స్​ విజేతలతో మోదీ సమావేశం.. వీడియో రిలీజ్

author img

By

Published : Sep 12, 2021, 11:52 AM IST

Updated : Sep 12, 2021, 1:57 PM IST

modi

టోక్యో పారాలింపిక్స్​లో(Tokyo Paralympics 2021) పతకాలు సాధించిన భారత​ క్రీడాకారులను ఇటీవల కలిసిన ప్రధాని మోదీ(Modi Meets Paralympians).. వారితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వీడియోను తాజాగా ట్విట్టర్​లో షేర్ చేశారు ప్రధాని.

పారాఅథ్లెట్లతో ప్రధాని మోదీ ఆత్మీయ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi News).. టోక్యో పారాలింపిక్స్(Tokyo Paralympics India)​ పతక విజేతలకు ఇటీవల ఆత్మీయ అతిథ్యం ఇచ్చారు. దేశానికి 19 మెడల్స్​ సాధించి పెట్టిన అథ్లెట్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఒక్కో క్రీడాకారుడితో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. వారి విజయాలను, కృషిని ప్రశంసించారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు మోదీ(Modi Meets Paralympians).

టోక్యో ఒలింపిక్స్​ ప్రారంభం అవ్వకముందు నుంచి ఇప్పటివరకు(పారాలింపిక్స్​ ముగిసిన తర్వాత) భారత అథ్లెట్లలో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతూనే ఉన్నారు ప్రధాని మోదీ.

PM Modi
పతక విజేతలతో ప్రధాని

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టోక్యోలో జరిగిన పారాలింపిక్స్​లో(tokyo paralympics india medals) భారత్ అదరగొట్టేసింది.​ చరిత్రలో లేనంత అత్యుత్తమ ప్రదర్శనతో తమ ప్రయాణాన్ని ముగించింది. ఉత్కంఠంగా సాగిన ఈ పోటీల్లో మన అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచి దేశప్రజల మనసులు గెలుచుకున్నారు. పారాలింపిక్స్​లో ఎక్కువ పతకాలు(19) సాధించి దేశ గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి.

ఇదీ చదవండి:వైకల్యాన్ని ఓడించారు.. విజయాన్ని సాధించారు!

Last Updated :Sep 12, 2021, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.