పెరిగిన నీరజ్ బ్రాండ్ విలువ.. కోహ్లీకి సమంగా!

author img

By

Published : Sep 8, 2021, 12:31 PM IST

neeraj chopra

జావెలిన్​ త్రో స్టార్ నీరజ్​ చోప్డా(Neeraj Chopra Olympics).. టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీతో(Virat Kohli) సమంగా నిలవనున్నాడు. ప్రకటనల కోసం అతడు తీసుకునే పారితోషికం అమాంతం వెయ్యి శాతం పెరగడమే ఇందుకు కారణం.

టోక్యో ఒలింపిక్స్​ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్డా(Neeraj Chopra News).. సంపాదనలో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీకి చేరువ కానున్నాడు. ప్రకటనల కోసం అతడు తీసుకునే పారితోషికం(Neeraj Chopra brand endorsement) అమాంతం వెయ్యి శాతం పెరగడమే ఇందుకు కారణం.

టోక్యో ఒలింపిక్స్​ తర్వాత నీరజ్​ చోప్డా(Neeraj Chopra Olympics) పేరు దేశమంతటా మారుమోగింది. ఈ క్రమంలో అతడికి పాపులారిటీ విపరీతంగా పెరిగింది. 2020 ఒలింపిక్స్​కు ముందు నీరజ్ చోప్డా.. ప్రకటనల కోసం తీసుకునే పారితోషికం ఏడాదికి 15-25 లక్షల మధ్య ఉండేది. అయితే.. ఒలింపిక్స్​లో 87.58 రికార్డు త్రోతో స్వర్ణం సాధించిన తర్వాత అతడి ప్రకటనల పారితోషికం 10 రెట్లు పెరగడం ఆశ్చర్యకరమైన విషయమని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత ఈవెంట్ల తర్వాత ఏ ఆటగాడి పారితోషికం ఇంతలా పెరగలేదని అంటున్నారు.

టాప్​లో కోహ్లీ..

ప్రస్తుతం దేశంలోని క్రీడాకారులందరిలో.. టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మాత్రమే 1-5 కోట్ల మధ్య పారితోషికం తీసుకుంటున్నాడు. నీరజ్​ కూడా ఈ జాబితాలో చేరడం గమనార్హం. కానీ, కోహ్లీతో పోల్చితే.. నీరజ్​ సంపాదన కాస్త తక్కువగానే ఉంటుందని నిపుణులు తెలిపారు. మరోవైపు.. రూ. 50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఆర్జించే క్రికెటర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్​ను కూడా నీరజ్​ అధిగమించడం విశేషం.

ఇప్పటివరకు 80 బ్రాండ్​లు నీరజ్​తో ప్రకటనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని జేఎస్​డబ్ల్యూ స్పోర్ట్స్ చీఫ్​ ఎగ్జిక్యూటివ్ ముస్తఫా గౌస్ తెలిపారు. పారిస్​ ఒలింపిక్స్​ వరకు పలు బ్రాండ్​లతో ప్రకటనలు చేసేందుకు నీరజ్​ ఒప్పుకొన్నట్లు పేర్కొన్నారు. మద్యం, పొగాకు ఉత్పత్తుల బ్రాండ్​లకు ప్రకటనలు ఇవ్వకూడదని చోప్డా​ నిర్ణయించుకున్నట్లు గౌస్ స్పష్టం చేశారు.

చోప్డాకు ఇన్​స్టాగ్రామ్​లో 40 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్విట్టర్​లో ఈ సంఖ్య 6 లక్షలుగా ఉంది. ఒలింపిక్స్​లో పతకం గెలిచాక ఒక్కరోజులోనే నీరజ్​కు 11 లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు.

ఇదీ చదవండి:

సెక్స్ లైఫ్ గురించి నీరజ్​పై ప్రశ్న.. మండిపడ్డ నెటిజన్లు

'అందుకే కోహ్లీ గొప్ప నాయకుడయ్యాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.