నేటి నుంచే డెన్మార్క్‌ ఓపెన్‌.. బరిలో సింధు

author img

By

Published : Oct 19, 2021, 7:15 AM IST

pv sindu news

నేడు ప్రారంభం కానున్న డెన్మార్క్ ఓపెన్ ప్రపంచ ఓపెన్ టోర్నీలో స్టార్​ షట్లర్​ పి. వి. సింధు బరిలోకి దిగుతోంది. తొలి రౌండ్లో యిగిట్‌ (టర్కీ)తో నాలుగో సీడ్‌ సింధు మంగళవారం మధ్యాహ్నం తలపడనుంది.

టోక్యో ఒలింపిక్స్​లో కాంస్యం గెలిచిన తర్వాత ఆటకు దూరంగా ఉన్న భారత స్టార్​ షట్లర్​ పి. వి. సింధు మళ్లీ రాకెట్ పట్టనుంది. మంగళవారం ఆరంభం కానున్న డెన్మార్క్‌ ఓపెన్‌ ప్రపంచ ఓపెన్‌ టోర్నీలో మహిళల సింగ్‌ల్స్‌లో ఆమె టైటిలే లక్ష్యంగా బరిలో దిగుతోంది. తొలి రౌండ్లో యిగిట్‌ (టర్కీ)తో నాలుగో సీడ్‌ సింధు తలపడనుంది. ఈ రౌండ్‌ దాటితే రెండో రౌండ్లో థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి బుసానన్‌ ఆమెకు ఎదురుపడే అవకాశాలున్నాయి.

మరో స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్​ కూడా ఈ టోర్నీలో ఆడుతోంది. గాయం నుంచి కోలుకున్న ఆమె సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. అయా ఒహోరీ (జపాన్‌)తో ఆమె తొలి రౌండ్‌ మ్యాచ్‌ ఆడనుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ పోటీలో ఉన్నాడు. ఈ ఆదివారం ముగిసిన డచ్‌ ఓపెన్లో రన్నరప్‌గా నిలిచిన లక్ష్య ఇదే ఫామ్‌ను కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. తొలి రౌండ్లో అతడు... సహచరుడు సౌరభ్‌ వర్మతో తలపడనున్నాడు. స్టార్ షెట్లర్​ కిదాంబి శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌ కూడా బరిలో ఉన్నారు. తొలి రౌండ్లో శ్రీకాంత్​తోనే సాయిప్రణీత్ పోటీపడనున్నాడు. థామస్‌కప్‌లో రాణించి సమీర్‌వర్మ తొలి రౌండ్లో విదిత్‌శరణ్‌ను ఢీకొనబోతుండగా.. కామన్వెల్త్ మాజీ ఛాంపియన్ పారపల్లి కశ్యప్.. చోతిన్​ చెన్​ (చెనీస్​ తైపీ)తో తలపడనున్నాడు. డబుల్స్‌లో సిక్కి రెడ్డి-అశ్విని పన్నప్ప, మేఘన జక్కంపుడి-పూర్వీషా రామ్‌... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో "సాత్విక్​-అశ్విని బరిలో ఉన్నారు.

ఇదీ చదవండి:'బీసీసీఐ-పీసీబీ మధ్య స్నేహబంధం ఏర్పడాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.