ఇంగ్లాండ్ టెస్ట్​ జట్టు హెడ్​ కోచ్​గా మెక్​కలమ్

author img

By

Published : May 12, 2022, 7:31 PM IST

Updated : May 12, 2022, 11:22 PM IST

Brendon McCullum appointed as the Head Coach of England's men's Test Cricket team.

తమ టెస్ట్​ జట్టుకు కొత్త హెడ్​కోచ్​ను నియమించింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు. న్యూజిలాండ్ మాజీ సారథి బ్రెండన్ మెక్​కలమ్​ హెడ్​ కోచ్​గా ఎంపిక చేసినట్లు ప్రకటించింది.

ఇంగ్లాండ్ టెస్ట్​ జట్టుకు హెడ్​ కోచ్​గా న్యూజిలాండ్ మాజీ సారథి బ్రెండన్ మెక్​కలమ్ నియామకమయ్యాడు. ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ హెడ్ కోచ్ అయిన మెక్​కలమ్​ను​ ఇంగ్లాండ్ జట్టుకు కూడా కోచ్​గా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తాజా ప్రకటనతో ఆ ప్రచారం నిజమైంది. ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. గత కొద్దిరోజులుగా మెక్​కలమ్​తో జరిపిన సుధీర్ఘ చర్చల అనంతరం..నియామకాన్ని ప్రకటించారు.

ఏడాది కాలంగా ఇంగ్లాండ్​ జట్టును పరాజయాలు వెంటాడుతున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్​తో ఓడటం.. యాషెస్​ సిరీస్​లో ఆసీస్ చేతిలో 4-0 ఘోర పరాజయాన్ని చవిచూడం వల్ల జట్టుతోపాటు బోర్డుపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతకు ముందు భారత్​ జరిగిన సిరీస్​లో ఇంగ్లాండ్​ టీమ్​ ఓడిపోయింది. దీంతో దిద్దు బాటు చర్యలకు దిగింది ఈసీబీ. అందులో భాగంగానే ఇటీవల జో రూట్​ను కెప్టెన్​ బాధ్యతల నుంచి తప్పించింది. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను కొత్త కెప్టెన్ గా నియమించింది. తాజాగా కొత్త హెడ్​కోచ్​ను తీసుకొచ్చింది.

జూన్​లో న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్​లో పర్యటించనుంది. మూడు టెస్టుల నిమిత్తం కివీస్.. ఇంగ్లాండ్ లో పర్యటించాల్సి ఉంది. ఈ సిరీస్ నుంచే స్టోక్స్ ఇంగ్లాండ్ సారథిగా బాధ్యతలు చేపడతాడు. ఇప్పుడు మెక్ కల్లమ్.. ఇంగ్లాండ్​ హెడ్​ కోచ్​గా నియామకమైన నేపథ్యంలో.. న్యూజిలాండ్ జట్టు పర్యటన సందర్భంలో సొంత జట్టుకు వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ జట్టులో టెస్ట్, పరిమిత ఓవర్ల క్రికెట్ లో వేర్వేరు సారథులు ఉంటారు. అదే మాదిరిగా హెడ్ కోచ్​లు కూడా వేరువేరుగా ఉంటారు.

ఇదీ చదవండి: 156 గంటల్లో 480కి.మీ 'గిన్నిస్​' రన్.. ఆక్సిజన్ కొరత, మైనస్ ఉష్ణోగ్రత మధ్యే..

Last Updated :May 12, 2022, 11:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.