కాంస్య పోరులో భారత్​ జట్టు ఓటమి

author img

By

Published : Dec 5, 2021, 7:44 PM IST

junior hockey team

Junior Hockey World Cup 2021ప్రపంచ జూనియర్ హాకీ టోర్నమెంట్​లో మరోసారి భారత జట్టుపై విజయం సాధించింది ఫ్రాన్స్. దీంతో కాంస్య పతకం సొంతం చేసుకుంది.

Junior Hockey World Cup 2021: ప్రపంచ జూనియర్ హాకీ టోర్నమెంట్​ కాంస్య పతక పోరులో డిఫెండింగ్​ ఛాంపియన్స్​ భారత్​పై గెలిచింది ఫ్రాన్స్. ఆదివారం భువనేశ్వర్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో 1-3 తేడాతో విజయం సాధించింది.

ind vs france
భారత్ X ఫ్రాన్స్

లీగ్‌ దశలో తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ చేతిలో అనూహ్య పరాజయం చవిచూసిన యువ భారత్‌ మరోసారి ఓటమిపాలైంది. ఫ్రాన్స్​ జట్టు కెప్టెన్ టిమోతీ క్లెమెంట్ ఈమ్యాచ్​లో హ్యాట్రిక్ గోల్స్​ చేశాడు. దీంతో మొత్తం టోర్నీలో నాలుగు హ్యాట్రిక్స్​ చేసిన ఆటగాడిగా నిలిచాడు. భారత్​ తరఫున సుదీప్​ ఒక్క గోల్ చేశాడు.

మరోవైపు ప్రపంచకప్‌ తుది పోరులో అర్జెంటీనాతో జర్మనీ తలపడనుంది.

ఇదీ చదవండి:

ఫైనల్​ ఆశలు గల్లంతు.. సెమీస్​లో భారత్​ ఓటమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.