Junior Hockey World Cup 2021: టైటిల్​ విజేతగా నిలిచిన అర్జెంటీనా

author img

By

Published : Dec 5, 2021, 10:56 PM IST

argentina

Junior Hockey World Cup 2021: ప్రపంచ జూనియర్ హాకీ టోర్నమెంట్​ ఫైనల్స్​లో అర్జెంటీనా జట్టు విజేతగా నిలిచింది. జర్మనీపై 4-2 తేడాతో విజయం సాధించింది.

Junior Hockey World Cup 2021: జూనియర్​ హాకీ ప్రపంచ కప్​ విజేతగా నిలిచింది అర్జెంటీనా. భువనేశ్వర్ వేదికగా ఆదివారం జరిగిన తుది పోరులో జర్మనీపై గెలిచింది.

జర్మనీని 4-2 తేడాతో ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది అర్జెంటీనా. లౌతారో డొమిని మూడు పెనాల్టీ కార్నర్​ అవకాశాలను సద్వినియోగం చేసి అర్జెంటీనా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో ఆటగాడు ఫ్రాంకో ఓ గోల్​ చేశాడు.

జర్మనీ జట్టులో జులియస్ హైనర్, మాసి ఫాండిట్ తలో గోల్ చేశారు. జూనియర్​ హాకీ ప్రపంచ కప్​లో ఆరోసారి విజేతగా నిలిచింది.

ఇదీ చదవండి:

కాంస్య పోరులో భారత్​ జట్టు ఓటమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.