జపాన్​తో నాకౌట్‌ సమరం.. భారత్‌కు ఎదురుందా?

author img

By

Published : Dec 21, 2021, 9:25 AM IST

HOCKEY SEMI FINAL

Hockey Champions Trophy: హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. నేడు సెమీఫైనల్స్​ ఆడనుంది. ఈ మ్యాచ్​లో జపాన్‌తో తలపడనుంది.

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్​లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ నాకౌట్‌ సమరానికి సిద్ధమైంది. లీగ్‌ దశలో ఓటమి లేకుండా ముందంజ వేసిన భారత్‌.. మంగళవారం జరిగే సెమీఫైనల్లో జపాన్‌తో తలపడనుంది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో తమపై 6-0తో గెలిచిన భారత్‌ను సెమీస్‌లో నిలువరించడం జపాన్‌కు కత్తి మీద సామే.

వైస్‌ కెప్టెన్‌, డ్రాగ్‌ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ భారత్‌ను ముందుండి నడిపిస్తుండగా.. దిల్‌ప్రీత్‌సింగ్‌, ఆకాశ్‌దీప్‌ సింగ్‌, షంషేర్‌ సింగ్‌ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. యువ గోల్‌కీపర్‌ సూరజ్‌ కూడా సత్తా చాటుతున్నాడు. సెమీస్‌లోనూ వీళ్లు రాణిస్తే మన జట్టుకు తిరుగుండదు. అటు డిఫెన్స్‌లో, ఇటు అటాకింగ్‌లో దుర్భేద్యంగా ఉన్న మన్‌ప్రీత్‌ బృందంపై గెలవాలంటే జపాన్‌ అద్భుతం చేయాల్సిందే.

అయితే పెనాల్టీ కార్నర్లను ఎక్కువగా ఇవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం భారత్‌కు ఉంది. మరో సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో పాకిస్థాన్‌ తలపడనుంది. భారత్‌-జపాన్‌ సెమీస్‌ మ్యాచ్‌ స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.