పాకిస్థాన్​పై భారత్​ విజయం.. కాంస్యం కైవసం

author img

By

Published : Dec 22, 2021, 5:05 PM IST

Updated : Dec 22, 2021, 7:46 PM IST

పాకిస్థాన్​పై భారత్​ విజయం, ఆసియా హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీASIAN CHAMPIONS HOCKEY TROPHY

17:02 December 22

పాకిస్థాన్​పై భారత్​ విజయం

ASIAN CHAMPIONS HOCKEY TROPHY: ఆసియా హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా సెమీస్​లో ఓడిన భారత జట్టు తిరిగి పుంజుకుంది. నేడు(బుధవారం) మూడో స్థానం కోసం హోరాహోరీగా జరిగిన ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలుపొంది కాంస్య పతకాన్ని అందుకుంది. 4-3 తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. భారత్​ తరఫున వైస్​కెప్టెన్​ హర్మన్​ప్రీత్​సింగ్​​(1వ నిమిషంలో), సుమిత్​(45వ ని.), వరుణ్​​ కుమార్​(53వ ని.), ఆకాశ్​దీప్​ సింగ్​(57వ ని.) ఒక్కో గోల్​ చేశారు. పాక్​కు అఫ్రజ్​, అబ్దుల్​ రానా, అహ్మద్​ నదీమ్ ఒక్కో గోల్​ అందించారు. అంతకుముందు మంగళవారం జరిగిన సెమీఫైనల్​లో భారత్​.. జపాన్‌ చేతిలో 3-5 తేడాతో ఓడిపోయింది. దీంతో కాంస్యం కోసం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో తొలి నుంచి భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. వరుసగా నాలుగు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు వచ్చినా ఒకదానినే గోల్‌గా మలిచారు. తొలి క్వార్టర్‌ ముగిసే సరికి భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అయితే వెంటనే పుంజుకున్న పాకిస్థాన్‌ పదకొండో నిమిషంలో (అర్ఫ్రాజ్) గోల్‌ చేసి స్కోరును 1-1 సమం చేసింది. మూడో క్వార్టర్‌ (33వ నిమిషం) ప్రారంభంలోనే పాక్‌ ప్లేయర్ అబ్దుల్‌ గోల్‌ కొట్టడంతో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 45వ నిమిషం వద్ద సుమిత్ గోల్‌తో మళ్లీ స్కోరు (2-2) సమమైంది. వరుణ్‌ కుమార్‌ (53వ నిమిషం), ఆకాశ్‌ దీప్ (57వ నిమిషం) వరుసగా గోల్స్‌ సాధించడంతో భారత్ 4-2తో విజయం వైపు దూసుకెళ్లింది. అయితే ఆఖర్లో పాక్‌ గోల్స్ చేసినా ఆధిక్యం తగ్గించగలిగిందే కానీ.. విజయం సాధించలేకపోయింది. దీంతో చివరికి భారత్‌ 4-3 తేడాతో సూపర్‌ విక్టరీని నమోదు చేసి కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.


ఇదీ చూడండి: ఆసియా హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ ఓటమి

Last Updated :Dec 22, 2021, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.