WTC points table: టాప్​-5లోకి దక్షిణాఫ్రికా.. టీమ్​ఇండియా స్థానం?

author img

By

Published : Jan 15, 2022, 12:19 PM IST

teamindia

WTC 2021-23 Points Table: దక్షిణాఫ్రికా చేతిలో ఓడి సిరీస్​ను చేజార్చుకున్న టీమ్​ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ పాయింట్ల పట్టికలో మరో స్థానాన్ని కోల్పోయింది. ప్రొటీస్​ జట్టు తమ ర్యాంకును మెరుగుపరుచుకుంది. ఇంతకీ ఏఏ జట్లు ఏఏ స్థానాల్లో ఉన్నాయంటే...

WTC 2021-23 Points Table: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో ఓడి టెస్టు సిరీస్​ను చేజార్చుకున్న టీమ్​ఇండియాకు మరో నిరాశ ఎదురైంది. ప్రొటీస్​ జట్టు చేతిలో ఓటమి చెందిన నేపథ్యంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ కొత్త పాయింట్ల పట్టికను ప్రకటించింది ఐసీసీ. ఇందులో కోహ్లీసేన.. మరో స్థానం కిందకు పడిపోయింది. 49.07 విజయాల శాతం, 53 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఇక సిరీస్​ గెలుచుకున్న దక్షిణాఫ్రికా.. 66.66 విజయాల శాతం, 24 పాయింట్లతో నాలుగో ర్యాంకుకు చేరింది.

శ్రీలంక(100 శాతం, 24 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా(83.33 శాతం, 40 పాయింట్లు), పాకిస్థాన్​(75 శాతం, 36 పాయింట్లు) రెండు, మూడు ర్యాంకుల్లో నిలిచాయి.

WTC 2021-23 Points System: డబ్ల్యూటీసీ-2 ​(2021-2023) కోసం కొత్త పాయింట్ల పద్ధతిని ఇదివరకే ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్ ​(ఐసీసీ). పర్సెంటేజ్​ ఆఫ్​ పాయింట్ల ప్రకారం జట్లకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు తెలిపింది. గెలిచిన ప్రతి మ్యాచ్​కు 12 పాయింట్లు వస్తాయని వెల్లడించింది.

WTC points table
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక

ఈ కొత్త పద్ధతి ప్రకారం గెలిచిన ప్రతి మ్యాచ్​కు 12 పాయింట్లు, పర్సెంటేజ్​ రూపంలో 100 పాయింట్లు ఇస్తారు. టై అయితే (6 పాయింట్లు, 50 శాతం), డ్రా (4 పాయింట్లు, 33.33 శాతం), ఓడిన మ్యాచ్​కు (0 పాయింట్లు, 0 శాతం) ఉంటాయి. మ్యాచ్​ల సంఖ్య ఆధారంగా సిరీస్​ పాయింట్లను కేటాయిస్తారు.

ఇదీ చూడండి: అమెరికా గోల్ఫ్​ స్టార్​.. అందాల భామ కూడా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.