వరుసగా 5 ఓటములు.. కానీ ఆర్సీబీకి ఎలిమినేటర్​ ఛాన్స్​.. ఎలా అంటే?

author img

By

Published : Mar 15, 2023, 7:32 AM IST

Updated : Mar 15, 2023, 8:33 AM IST

Rcb eliminator chance

ఐపీఎల్​లో సరైన విజయాన్ని అందుకోలేక ఆర్సీబీ మెన్స్​ టీమ్​ ఎలాంటి విమర్శలను ఎదుర్కొంటుందో.. ఇప్పుడు డబ్ల్యూపీఎల్​లోనూ అమ్మాయిల జట్టు అలాంటి కష్టాలనే ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు వరుసగా ఐదు ఓటములను ఎదుర్కొన్న ఈ జట్టు ఇంకా బోణీ కొట్టలేదు. కానీ ఈ జట్టుకు టోర్నీలో ముందడగు వేసేందుకు మరో అవకాశం ఉంది. అదేంటంటే..

జట్టులో అంతా స్టార్ ప్లేయర్లే.. అత్యంత బలమైన జట్టు కూడా.. కానీ ఇప్పటి వరకు బోణీ కొట్టలేదు. పేలవ ప్రదర్శనతో వరుసగా 5 ఓటములను అందుకుంది. బ్యాటింగ్ బాగా చేస్తే బౌలింగ్​లో.. బౌలింగ్‌లో మంచిగా రాణిస్తే బ్యాటింగ్​లో వైఫల్యం అవుతూ పరాజయాలను మూటగట్టుకుంటోంది. ఐపీఎల్​లో మెన్స్​ టీమ్​ ఎలాంటి విమర్శలను ఎదుర్కొంటుందో.. ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)‌లోనూ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు అదే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం జరుగుతున్న తొలి సీజన్​లో ఇప్పటి వరకు ఒక్క సక్సెస్​ను కూడా నమోదు చేయలేక చతికిలపడింది. కెప్టెన్ స్మృతి మంధాన ప్రస్తుతం ఈ టోర్నీలో విఫలమవుతోంది. ఆమె కెప్టెన్సీ భారాన్ని మోయలేకపోతుందని క్రికెట్​ అభిమానులు అంటున్నారు! ఆమె వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బ తీస్తోందని అంటున్నారు. ఆమె బ్యాట్ ఝులిపించాలని ఆశపడుతున్నారు. ఇకపోతే మంధాన వైఫల్యంతో పాటు జట్టులోని మిగతా ప్లేయర్స్​ కూడా సమిష్టిగా రాణించలేకపోతున్నారు.

రీసెంట్​గా దిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లోనూ ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి చెందింది. చివరి ఓవర్‌లో 9 పరుగులు సాధించలేక ఓటమి ముందు తల వంచింది. అలా వరుస ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉండిపోయిది. అయితే ఈ ఓటములు తన ఖాతాలో వేసుకున్నప్పటికీ.. టోర్నీలో ముందడుగు వేసే మరో అవకాశం ఆర్సీబీకి ఉంది.

అదెలా అంటే.. ఆర్సీబీ చివరి మూడు మ్యాచ్‌లను గెలవడంతో పాటు ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ జట్లు.. గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్‌పై గెలుపొందాల్సిన అవసరం ఉంది. అలాగే గుజరాత్ జెయింట్స్.. యూపీ వారియర్స్‌ను కూడా మట్టికరిపించాలి. అలా జరిగితే పాయింట్స్​ టేబుల్​లో ఆఖరి స్థానంలో ఉన్న రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు.. టాప్-3లోకి దూసుకొస్తుంది. టోర్నీ ఫార్మాట్ రూల్స్​ ప్రకారం అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా తుది పోరుకు అర్హత సాధించనుండగా.. రెండు, మూడో స్థానంలో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్​లో తలపడతాయి. ఇకపోతే ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్​ యూపీ వారియర్స్​తో నేడు(మార్చి 15)న తలపడనుంది. ముంబయిలోని డీవై పాటిల్​ స్టేడియం వేదికగా జరగనుంది మరి కొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఆ తర్వాత గుజరాత్ జెయింట్స్(మార్చి 18), ముంబయి ఇండియన్స్( మార్చి 21)లతో ఆడనుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్​.. తమ అభిమాన జట్టు ఎలాగైనా బోణీ కొట్టి టోర్నీలో ముందడగు వేయాలని ఆశిస్తున్నారు. చూడాలి మరి ఈ జట్లతో ఆడే మ్యాచుల్లో ఎలా ఆడుతుందో.

ఇదీ చూడండి: మెరిసిన కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌.. ప్లేఆఫ్స్‌లో ముంబయి

Last Updated :Mar 15, 2023, 8:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.