విరాట్ కోహ్లీ న్యూ హెయిర్​ స్టైల్​​.. ఫొటోలు వైరల్​!

author img

By

Published : Sep 18, 2022, 12:59 PM IST

virat kohli new look for t20 worldcup

ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్​కు ముందు భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కొత్త లుక్​లో దర్శనమిచ్చాడు. న్యూ హెయిర్ స్టైల్​తో ఆకట్టుకుంటున్నాడు.

Virat Kohli New Look: భారత క్రికెటర్లలో స్టైల్​ ఐకాన్​ల్లా ఉన్న వారిలో మాజీ సారథి విరాట్​ కోహ్లీ ఒకడు. అతడి​ స్టైల్​కు కితాబులిచ్చేవారితో పాటు ఆ స్టైల్​ను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువే. ప్రతి సిరీస్​కు ముందు కొహ్లీ.. తన స్టైల్​లో కొన్ని మార్పులు చేస్తుంటాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగే టీ20 సిరీస్​ కోసం సన్నద్ధమవుతున్న విరాట్.. తన కొత్త హెయిర్ స్టైల్​తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

సెలెబ్రిటీ హెయిర్‌ స్టైలిస్ట్‌ రషీద్‌ సల్మానీ.. కోహ్లీకి ఈ కొత్త రూపు తీసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. కోహ్లీ చాలా అందంగా ఉన్నాడని.. మరింత హాట్‌గా మారాడని.. ఈ ఫొటోలపై పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే కోహ్లీ కొత్త లుక్ చూసి అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ స్పందించాడు. 'విత్ ద కింగ్ హిమ్ సెల్ఫ్' అని రిప్లై ఇచ్చాడు. అలానే సింగర్ హార్డీ సంధు 'చా గయే గురూ' అంటూ కామెంట్ చేశాడు. అభిమానులైతే 'కోహ్లీ చాలా హాట్​గా కనిపిస్తున్నాడు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ కోసం కింగ్‌ కోహ్లీ మొహాలీ చేరుకున్నాడు. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్‌ ఈ నెల 20న మొహాలీలోని పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(పీసీఏ) స్టేడియంలో జరగనుంది. మొహాలీ ఎయిర్‌పోర్టులో విరాట్‌ దిగిన దృశ్యాలను పీసీఏ తన ట్విటర్‌లో పంచుకుంది. అందమైన నగరంలోకి విరాట్‌కు స్వాగతం అని పేర్కొంది.

ఇదీ చదవండి: 'నా భర్తను చాలా మిస్సవుతున్నా'.. అనుష్క శర్మ ఎమోషనల్​ పోస్ట్​ వైరల్​!

క్రికెట్​లోకి ఉసేన్​ బోల్ట్​ ఎంట్రీ.. భారత్​లోనే మ్యాచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.