T20 World Cup 2021: నిన్న ఉమ్రాన్​ మాలిక్​.. నేడు ఆవేశ్​ ఖాన్​

author img

By

Published : Oct 12, 2021, 8:27 PM IST

Avesh Khan updates

ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న బౌలర్​ ఆవేశ్​ ఖాన్​ను అదృష్టం వరించింది. రాబోయే టీ20 ప్రపంచకప్​లో భారత జట్టుకు మరో నెట్​ బౌలర్​గా ఆవేశ్​ ఖాన్​ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇటీవలే సన్​రైజర్స్​ హైదరబాద్​ జట్టు పేసర్​ ఉమ్రాన్​ మాలిక్​ను ఎంచుకోగా.. ఇప్పుడు ఆవేశ్​ను నెట్​ బౌలర్​గా బీసీసీఐ ఎంపికచేసింది.

దిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్​ బౌలర్ ఆవేశ్ ఖాన్​ను అదృష్టం వరించింది. టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా(Avesh Khan latest news) నెట్ బౌలర్​గా ఆవేశ్​ ఖాన్​ ఎంపికైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఐపీఎల్​ పూర్తవ్వగానే ఆ బౌలర్​ను యూఏఈలో ఉండాలని బీసీసీఐ ఆదేశించిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

కశ్మీర్​ పేసర్ ఉమ్రాన్​ మాలిక్ తర్వాత రెండో నెట్​ బౌలర్​గా ఆవేశ్​ను టీమ్​ఇండియా కోసం ఎంపికచేసినట్లు సమాచారం. సరాసరి గంటకు 142 నుంచి 145 కి.మీ. వేగంతో బంతిని విసరగల నైపుణ్యం ఆవేశ్​కు ఉంది. అంతేకాకుండా ప్రస్తుత ఐపీఎల్ సీజన్​​లో 23 వికెట్లను పడగొట్టి.. టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలోనూ రెండో స్థానంలో నిలిచాడు. ఒకవేళ రాబోయే టీ20 ప్రపంచకప్​లో ఎవరైన బౌలర్​కు విశ్రాంతి లభిస్తే.. ఆవేశ్​ ఖాన్​కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 17 నుంచి దుబాయ్​ వేదికగా ప్రారంభం కానుంది. విరాట్​ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు.. అక్టోబరు 24న పాకిస్థాన్​తో తలపడనుంది.

ఇదీ చదవండి:తండ్రిగా ప్రమోషన్​.. అదే రోజు క్రికెట్ కోసం దుబాయ్​కు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.