పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన క్రికెటర్​ ప్రేయసి.. త్వరలోనే పెళ్లి!

author img

By

Published : Nov 25, 2022, 1:42 PM IST

stuart-broad-and-fiance-mollie-king-blessed-with-a-baby-girl

ఇంగ్లాండ్​ పేసర్​ స్టువర్ట్​ బ్రాడ్​​, సింగర్​ మోలీ కింగ్​ తల్లిదండ్రులయ్యారు. తన ప్రేయసి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని స్టువర్ట్​ బ్రాడ్​ ఇన్​స్టాలో షేర్​ చేశాడు.

Stuart Broad Daughter: ఇంగ్లాండ్ స్టార్​ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన అభిమానుల కోసం శుక్రవారం ఓ గుడ్​న్యూస్​ తెలిపాడు. సింగర్​ మోలీ కింగ్​తో ప్రేమలో ఉన్న ఆయన ఓ పండంటి ఆడబిడ్డకు తండ్రినయ్యానని ఇన్​స్టాలో షేర్​ చేశాడు. ఈ ఆనందాన్ని పాప తల్లి కూడా తన అభిమానులతో పంచుకుంది.

పాపకు అన్నాబెల్లా అని పేరు పెట్టామని ఈ జంట తమ ఇన్​స్టాగ్రామ్​ ఖాతాల ద్వారా తెలియజేసింది. 2012 నుంచి డేటింగ్​లో ఉన్న ఈ జంట 2021లో ఒకటవ్వనున్నట్లు ప్రకటించారు. కానీ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని తెలిసింది.
ప్రస్తుతం స్టువర్ట్​ గాయం కారణంగా క్రికెట్​కు కొద్దిరోజులు విరామం ఇచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.