ఆర్సీబీ కొత్త కోచ్​గా బంగర్.. రెండేళ్లకు ఒప్పందం

author img

By

Published : Nov 9, 2021, 12:58 PM IST

Sanjay Bangar

వచ్చే రెండు ఐపీఎల్(ipl 2021 news) సీజన్ల కోసం కొత్త కోచ్​ను నియమించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(royal challengers bangalore 2022). ప్రస్తుతం ఆ జట్టుకు బ్యాటింగ్ కోచ్​గా ఉన్న సంజయ్ బంగర్​(sanjay bangar rcb coach)కు హెడ్​ కోచ్​గా బాధ్యతలు అప్పగించింది. గత సీజన్​లో కోచ్​గా ఉన్న మైక్ హసెన్​.. జట్టు క్రికెట్ వ్యవహారాల డైరెక్టర్​గా కొనసాగనున్నాడు.

ఐపీఎల్-2021(ipl 2021 news)లోనూ అభిమానులకు నిరాశే మిగిల్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(royal challengers bangalore 2021). జట్టు ఓటమి కంటే ఈ సీజన్​ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం వారికి మరింత ఆవేదన మిగిల్చింది. ఈ నేపథ్యంలో జట్టును మరింత బలంగా తయారు చేసేందుకు సిద్ధమైంది ఆర్సీబీ. వచ్చే సీజన్​కు ముందు మెగావేలం జరగనున్న క్రమంలో కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్​ కోచ్​ను కూడా మార్చింది. టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ సంజయ్ బంగర్​(sanjay bangar rcb coach)ను ప్రధాన కోచ్​గా తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

గతేడాది మొదటి విడతలో ఆర్సీబీకి కోచ్​గా ఉన్నాడు సైమన్ కటిచ్. యూఏఈ వేదికగా జరిగిన రెండో విడతకు అతడు అందుబాటులో ఉండట్లేదని తెలిపాడు. దీంతో మైక్ హెసన్(mike hesson rcb news)కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇతడి పర్యవేక్షణలో జట్టు టైటిల్ సాధించడంలో విఫలమైనందున మరోసారి కొత్త కోచ్​ను తీసుకుంది. ప్రస్తుతం ఆర్సీబీకి బ్యాటింగ్​ కోచ్​గా ఉన్న సంజయ్ బంగర్(sanjay bangar rcb coach)​ను ప్రధాన కోచ్​గా నియమించింది. ఇతడు ఆర్సీబీకి వచ్చే రెండు సీజన్లకు కోచ్​గా వ్యవహరించనున్నాడు. మైక్ హెసన్​ జట్టు క్రికెట్ వ్యవహారాల డైరెక్టర్​గా కొనసాగనున్నాడు.

ఐపీఎల్-2022(ipl 2022 news) వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్​లో ప్రారంభం కానుంది. అంతకుముందు జనవరిలో మెగా వేలం(ipl 2022 mega auction) నిర్వహించనున్నారు. ఈ సీజన్​లో మరో రెండు కొత్త జట్లు(ipl 2022 new teams) పాల్గొననున్న నేపథ్యంలో ఈసారి వేలంపై అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నా.. ఆటగాడిగా అదే జట్టుతో కొనసాగనున్నాడు. దీంతో కొత్త కెప్టెన్ వేటలో పడింది ఆర్సీబీ యాజమాన్యం. ఈ జాబితాలో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఇవీ చూడండి

షోయబ్ అక్తర్‌పై రూ.10కోట్ల పరువునష్టం దావా

డ్రెస్సింగ్​ రూమ్​లో రవిశాస్త్రి భావోద్వేగ సందేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.