టీమ్​ఇండియా మాజీ దిగ్గజం స్టన్నింగ్​​ క్యాచ్​.. వీడియో చూశారా?

author img

By

Published : Mar 19, 2023, 10:31 AM IST

Etv Bharat

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ మొహమ్మద్​ కైఫ్​ సంచలన క్యాచ్​ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అతడు సోషల్​మీడియాలో సెన్సేషన్​గా మారిపోయాడు. అతడి క్యాచ్​ పట్టుకున్న వీడియో.. తెగ వైరలవుతోంది.

భారత క్రికెట్​ జట్టు మాజీ క్రికెట్​ మొహమ్మద్​ కైఫ్​.. అద్భుతమైన క్యాచ్​ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికి చాలా ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటి తరం యువ క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రీతిలో కళ్లు చెదిరే క్యాచ్​ పట్టుకున్నాడు. బుల్లెట్‌లా దూసుకెళ్తున్న బంతిని అమాంతం గాల్లోకి ఎగిరిదూకి.. ఒక్కచేతితో అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు.

ఆ క్యాచ్‌తో ఒక్కసారిగా కైఫ్‌ తన పాత రోజులను గుర్తు చేశాడు. ప్రస్తుతం కైఫ్​ పట్టిన సూపర్​ సింగిల్​ హ్యాండెడ్​ క్యాచ్​ వీడియో.. సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ఇలాంటి ఫిట్‌నెస్‌ ఉంచుకుని అనవసరంగా రిటైర్మెంట్‌ ఇచ్చాడంటూ క్రికెట్‌ అభిమానులు అంటున్నారు.

సౌరభ్​ గంగూలీ కెప్టెన్​గా ఉన్న సమయంలో టీమ్​ఇండియా జట్టులోకి వచ్చాడు కైఫ్​. యువరాజ్​ సింగ్​తో కలిసి ఇంగ్లాండ్​లో అతడు ఆడిన ఇన్నింగ్స్​ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అయితే.. కైఫ్‌ అంటే మాత్రం అందరికీ గుర్తుకు వచ్చేది ఫీల్డింగ్‌. అప్పటి జట్టులో కైఫ్‌ అద్భుతమైన ఫీల్డర్‌. ఎలాంటి క్యాచ్‌లనైనా డైవ్‌ చేస్తూ పట్టుకోవడంతో కైఫ్‌ సూపర్​. సూపర్‌ ఫీల్డింగ్‌తో పరుగులు ఆపాలన్న, రనౌట్లు చేయాలన్న కైఫ్‌ తర్వాతే ఎవరైనా. తన స్నేహితుడు యువరాజ్‌ సింగ్‌ కూడా కైఫ్‌కు ఫీల్డింగ్‌లో గట్టి పోటీ ఇచ్చేవాడు. వీళ్లిద్దరూ జట్టులో ఉంటే.. ప్రత్యర్థికి 20, 30 పరుగులు తగ్గినట్లే. అలాంటి ఫీల్డింగ్‌తో టీమ్​ఇండియా పెద్ద అసెట్‌గా ఉండేవాళ్లు.

అయితే అంతర్జాతీయ క్రికెట్​ నుంచి తప్పుకున్న తర్వాత కామెంటేటర్‌గా, కోచ్‌గా వ్యవహరిస్తున్న కైఫ్‌ తాజాగా.. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో ఆడుతున్నాడు. శనివారం రాత్రి ఇండియా మహరాజాస్‌-ఆసియా లయన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కైఫ్‌.. ఈ సంచలన క్యాచ్‌ అందుకున్నాడు. ఓజా వేసిన వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ ఐదో బంతిని శ్రీలంక మాజీ క్రికెటర్‌ తరంగా కట్‌ షాట్‌ ఆడాడు. ఆ బంతిని కైఫ్‌ తన కుడివైపుకు డైవ్‌ చేస్తూ.. సింగిల్‌ హ్యాండ్‌తో క్యాచ్‌ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కైఫ్‌ మొత్తం మూడు క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో కైఫ్‌లో ఇంకా వేడి తగ్గలేదని, వయసుతో కైఫ్​కు సంబంధం లేదంటూ నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు.

కాగా, శనివారం జరిగిన ఎలిమినేటర్​ మ్యాచ్​లో ఇండియా మహరాజాస్‌.. 85 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఫైనల్​ అవకాశాలు చేజార్చుకుంది. సోమవారం.. ఆసియా లయన్, వరల్డ్​ జెయింట్ల మధ్య ఫైనల్​ జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.