'అహాన్ని వీడి.. క్రమశిక్షణతో ఆడిన కోహ్లీ'
Updated on: Jan 12, 2022, 6:50 PM IST

'అహాన్ని వీడి.. క్రమశిక్షణతో ఆడిన కోహ్లీ'
Updated on: Jan 12, 2022, 6:50 PM IST
Gambhir On Virat Kohli: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. అయితే కోహ్లీ అహం వదిలి, క్రమశిక్షణతో ఆడుతూ ఆకట్టుకున్నాడని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మెచ్చుకున్నాడు.
Gambhir On Virat Kohli: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అహం వదిలేసి ఆడాడని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. క్రమశిక్షణతో ఆడుతూ ఆకట్టుకున్నాడని పేర్కొన్నాడు. అతడి షాట్ సెలెక్షన్ మెరుగ్గా ఉందని ప్రశంసించాడు.
విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు ఆటగాళ్లు తమ అహాన్ని వదిలేసి వెళ్లాలని కోహ్లీ ఇంతకు ముందే పలుమార్లు చెప్పాడు. గతంలో ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా కూడా అతడు ఇదే మాట చెప్పాడు. విరాట్ ఇప్పుడు ఆ మాటను నిరూపించుకున్నాడు. ఎంతో సహనంతో బ్యాటింగ్ చేశాడు. సఫారీ బౌలర్లు వైవిధ్యమైన బంతులతో సవాల్ చేసినా ఏకాగ్రతతో ఆడాడు. సహచర ఆటగాళ్ల నుంచి సరైన సహకారం అందకున్నా సరే క్రమశిక్షణతో బ్యాటింగ్ చేశాడు. బలహీనతను అధిగమిస్తూ.. ఆఫ్ స్టంప్ ఆవల వెళ్తున్న బంతులను వదిలేశాడు. బౌలర్లపై ఆదిపత్యం చెలాయించకుండా తన పని తాను చేసుకుపోయాడు. తన అహాన్ని పక్కన పెట్టి జట్టుకోసం విలువైన ఇన్నింగ్స్ ఆడాడు" అని గంభీర్ పేర్కొన్నాడు.
సెంచరీ కన్నా గొప్ప ఇన్నింగ్స్ ఇది..
సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడటంపై పలువురు క్రికెటర్లు స్పందించారు. కోహ్లీ సెంచరీ అందుకోలేకపోయినా.. అంతకు మించిన గొప్ప ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసలు కురిపించారు. బ్యాటర్లకు సవాల్ విసిరే కేప్‌టౌన్ పిచ్‌పై కోహ్లీ గొప్పగా రాణించాడని పేర్కొన్నారు.
"కోహ్లీ తొలి ఇన్నింగ్స్ ఆసాంతం తన క్లాస్ బ్యాటింగ్‌తో కట్టిపడేశాడు" అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. మరోవైపు వసీం జాఫర్, ఆర్పీ సింగ్, ఆకాశ్ చోప్రా, దినేశ్ కార్తిక్ తదితరులు కోహ్లీని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.
-
That inning had Virat Kohli’s Class written all over it. #INDvSA
— Irfan Pathan (@IrfanPathan) January 11, 2022
ఇదీ చూడండి: IND Vs SA: 'కోహ్లీ బ్యాటింగ్ తీరుపై ఆందోళనే లేదు'
