'అవకాశం ఇస్తే కొత్త జట్టుకు కెప్టెన్​గా ఉంటా'

author img

By

Published : Oct 13, 2021, 12:39 PM IST

warner

ఐపీఎల్​-2022లో(IPL 2022 new teams) రెండు కొత్త ఫ్రాంచైజీలు చేరనున్నాయి. అక్టోబర్ 25న ఈ ఫ్రాంచైజీల పేర్లను బీసీసీఐ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఒక జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు సన్​రైజర్స్​ బ్యాట్స్​మన్ డేవిడ్ వార్నర్(David warner news).

వచ్చే ఏడాది ఐపీఎల్​ కోసం రెండు కొత్త ఫ్రాంచైజీలు(IPL 2022 new teams) సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అందులో ఓ జట్టుకు సారథిగా వ్యవహరించే అవకాశం వస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు సన్​రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్(David Warner IPL News). ఎస్​ఆర్​హెచ్​ వరుస ఓటములు, వార్నర్​ పేలవ ప్రదర్శన కారణంగా అతడిని కెప్టెన్​గా తొలగిస్తూ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ బాధ్యతలు విలియమ్సన్​కు(Williamson SRH Captain) అప్పగించింది. ఈ నేపథ్యంలో కారణం కూడా చెప్పకుండా తనను కెప్టెన్సీ నుంచి తప్పించారని నిరాశ చెందాడు వార్నర్. ఇకపై సన్​రైజర్స్​కు ప్రాతినిథ్యం వహించబోనని ఇన్​స్టా పోస్ట్​లో తెలిపాడు.

అక్టోబర్ 25న బీసీసీఐ రెండు కొత్త ఫ్రాంచైజీలను(IPL 2022 new teams) ప్రకటించనున్న నేపథ్యంలో వార్నర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. "వచ్చే ఏడాది ఐపీఎల్​లో రెండు కొత్త జట్లు చేరనున్నాయి. ఏదైనా ఫ్రాంచైజీకి కెప్టెన్​ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా. ఆ బాధ్యతతో నేను బాగా ఆడతా. ఆటను బాగా ఎంజాయ్ చేస్తా" అని వార్నర్ తెలిపాడు.

ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తూ ఉత్సహంగా ఆడటంలో ముందుంటానని చెప్పుకొచ్చాడు వార్నర్. కొత్త జట్టుకు సారథిగా ఉండటంపై ఆసక్తి ఉందని చెబుతూ.. సన్​రైజర్స్​ ఆటగాళ్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:

IPL 2021: ఆటగాళ్లపై ట్రోల్స్.. దినేశ్​ కార్తిక్ అసహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.