CSKvsMI: ఆధిపత్య పోరులో విజయం ఎవరిదో!

author img

By

Published : Sep 19, 2021, 5:32 AM IST

IPL

ఐపీఎల్​ 14వ సీజన్​(ipl 2021 time table) రెండో విడతలో తొలి విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్(csk vs mi 2021). ఈ రెండు జట్ల మధ్య పోరుతో యూఏఈలో ఐపీఎల్ సెకండ్ ఫేజ్​ ప్రారంభంకానుంది.

ప్రేక్షకులకు మరింత వినోదం అందించేందుకు సిద్ధమైంది ఐపీఎల్. కరోనా కారణంగా 14వ సీజన్(ipl 2021 time table)​ అర్ధాంతరంగా వాయిదా పడగా.. రెండో విడతను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు సిద్ధమైంది పాలకమండలి. ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్​లో క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్​ను ముమ్మరం చేశాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. నేడు (సెప్టెంబర్ 19) డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్​తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది చెన్నై సూపర్ కింగ్స్(csk vs mi 2021). ఈ లీగ్ వాయిదా పడటానికి ముందు సీఎస్కేపై భారీ విజయం సాధించింది ముంబయి. ఇప్పుడు అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది ధోనీసేన. మరి గెలుపెవరిదో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ముంబయి సమస్యలు ఇవే!

ఇప్పటికే మొత్తం 14 మ్యాచ్​ల్లో సగం ఆడిన ముంబయి ఇండియన్స్​(mumbai indians team) నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. దీంతో ప్లే ఆఫ్స్​కు చేరాలంటే రెండో విడతలో విజయాలే లక్ష్యంగా ఆడాల్సి ఉంది. రోహిత్​సేనను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్యలు మిడిలార్డర్, పవర్​ప్లే బౌలింగ్ గణాంకాలు. స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్​ పాండ్యా బౌలింగ్​లోనూ రాణించాల్సిన అవసరం ఉంది. త్వరలోనే టీ20 ప్రపంచకప్​ జరగనున్న దృష్ట్యా అతడు తన ఆల్​రౌండ్ ప్రదర్శనను యాజమాన్యం దృష్టిలో పడేయాల్సి ఉంటుంది.

చెన్నై జోరు కొనసాగేనా!

గత సీజన్​లో నిరాశపర్చిన చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings)​.. ఈ సీజన్​లో మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, సామ్ కరన్​ అద్భుతంగా ఆడుతున్నారు. వీరికి తోడు స్పిన్నర్లు ఇమ్రాన్ తాహిర్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా చెలరేగుతున్నారు. మొయిన్, జడేజా బ్యాట్​తోనూ విలువైన పరుగులు జోడిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు కెప్టెన్ ధోనీ, రైనాలు కూడా బ్యాట్​కు పనిచెపితే చెన్నై విజయాలకు అడ్డుండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జట్లు

ముంబయి ఇండియన్స్

డికాక్, రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, పొలార్డ్, హార్దిక్ పాండ్యా, రాహుల్ చాహర్, నాథన్ కౌల్టర్​నీల్, బుమ్రా, బౌల్ట్, ఆడం మిల్నే, జయంత్ యాదవ్, క్రిస్ లిన్, పీయూష్ చావ్లా, ధావల్ కులకర్ణి, సౌరభ్ తివారి, ఆదిత్య తారె, రూష్ కలారియా, జేమ్స్ నీషమ్, అన్మోల్​ప్రీత్ సింగ్, అనుకూల్ రాయ్, అర్జున్ తెందుల్కర్, మార్కో జాన్సెన్, యుధ్​వీర్ సింగ్

చెన్నై సూపర్ కింగ్స్

రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, జడేజా, ధోనీ (కెప్టెన్), బ్రావో, శార్దూల్ ఠాకూర్, లుంగి ఎంగిడి, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్, డుప్లెసిస్, ఉతప్ప, కరణ్ శర్మ, జోష్ హెజిల్​వుడ్, బెహ్రండార్ఫ్, కృష్ణప్ప గౌతమ్, మిచెల్ సాంట్నర్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, హరి నిషాంత్, జగదీశన్, పుజారా, కేఎం ఆసిఫ్, హరిశంకర్ రెడ్డి, భగత్ వర్మ

ఇవీ చూడండి: ఐపీఎల్ సందడి వచ్చేసింది.. కిక్కు తెచ్చేసింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.