IPL 2021 records: చెన్నై ఓపెనర్లు సరికొత్త రికార్డు

author img

By

Published : Oct 16, 2021, 8:43 AM IST

ipl 2021 records

ఈసారి ఐపీఎల్​ కప్పు చెన్నై గెలవడంలో కీలకపాత్ర పోషించారు చెన్నై ఓపెనర్లు రుతురాజ్-డుప్లెసిస్. ఈ క్రమంలోనే పలు రికార్డులు సృష్టించారు. ఇంతకీ ఆ రికార్డులేంటి? దాని సంగతేంటి?

రెండు దశల్లో జరిగిన ఐపీఎల్‌ 14 సీజన్‌ విజేతగా చెన్నై సూపర్​కింగ్స్ నిలిచింది. ఈ విజయం వెనుక జట్టు (IPL 2021 records list) ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్​ల పాత్ర అంతా ఇంతా కాదు. బ్యాట్​తో పరుగుల వర్షం కురిపించి సీఎస్కేకు తిరుగులేని విజయం అందించారు. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. మరి ఆ రికార్డు(CSK VS KKR MATCH RECORDS) ఏంటంటే?

రుతురాజ్ మెరుపు షాట్లు..

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో చెన్నై యువ ఓపెనర్​ రుతురాజ్ గైక్వాడ్ (ruturaj gaikwad ipl runs) మొదటి నుంచి జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచాడు. మెరుపు షాట్స్​తో సీఎస్కేకు (ruthuraj gaikwad records) విజయాలు అందించాడు. విధ్వంసకర బ్యాటింగ్​తో ప్రత్యర్ధులకు చెమటలు పట్టించాడు. ఈసారి అత్యధిక పరుగుల వీరుడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ (IPL Awards 2021)​ సొంతం చేసుకున్నాడు. మొత్తంగా 16 మ్యాచ్​ల్లో 635 పరుగులతో నిలిచాడు. ఐపీఎల్​లో ఈ క్యాప్​ సాధించిన (IPL Awards 2021) అత్యంత పిన్నవయుస్కుడిగా రుతురాజ్​ ఘనత సాధించాడు. ఆరెంజ్​ క్యాప్​తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్​ ఆఫ్​ ది సీజన్​ అవార్డు కూడా ఇతడికే దక్కింది.

600 కంటే ఎక్కువ పరుగులతో రికార్డు

రుతురాజ్​తో పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డుప్లెసిస్‌ (du plessis records) ఐపీఎల్‌ 2021 సీజన్‌లో అదరగొట్టాడు. ప్రస్తుత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానం (633)లో నిలిచాడు. ఐపీఎల్​ ఫైనల్​లోనూ ఈ జోడి సీఎస్కే ఏడేళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఎక్కువసార్లు ఆఫ్​ సెంచరీ చేసిన ద్వయం నిలించింది. ఈ క్రమంలో 2013లో తమ జట్టుకు చెందిన హస్సీ-రైనా నెలకొల్పిన మార్కును అధిగమించారు.

అలానే ఒకే జట్టు నుంచి ఒక సీజన్​లో 600 కంటే ఎక్కువ పరుగుల చేసిన బ్యాట్స్​మెన్​గా రుతురాజ్-డుప్లెసిస్ నిలిచారు. అంతకంటే ముందు ఆర్సీబీ.. రెండుసార్లు ఈ ఘనత సాధించింది. 2013లో కోహ్లీ-గేల్ ఈ రికార్డు సృష్టించగా, 2016లో కోహ్లీ-డివిలియర్స్ ఈ మార్క్​ను అందుకున్నారు.

శుక్రవారం జరిగిన ఫైనల్​లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్లు డుప్లెసిస్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌(32) జంట తొలి వికెట్‌కు(61 పరుగులు) శుభారంభం అందించారు. అనంతరం కోల్​కతా 20 ఓవర్లలో 165 పరుగులే చేయగలిగింది. తద్వారా నాలుగో ఐపీఎల్‌ టైటిల్‌ను చెన్నై గెలుచుకుంది.

ఇవీ చదవండి:

IPL Awards 2021: ఆరెంజ్​, పర్పుల్​ క్యాప్ వీరులు వీళ్లే

IPL 2021 Final: డుప్లెసిస్​ మెరుపు ఇన్నింగ్స్​.. కోల్​కతా లక్ష్యం 193

IPL 2021 Final: చెన్నై 'సూపర్​' కింగ్స్​.. ఖాతాలో నాలుగో ట్రోఫీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.