IND vs SA Series: భారత్​తో టెస్టు సిరీస్​.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన

author img

By

Published : Dec 7, 2021, 2:12 PM IST

IND vs SA Test series, South Africa test squad for India Test series, భారత్ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్, భారత్ దక్షిణాఫ్రికా జట్టు

South Africa Test Squad: న్యూజిలాండ్​తో జరిగిన టెస్టు సిరీస్ గెలుచుకున్న టీమ్ఇండియా త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 26న భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో మూడు టెస్టుల ఈ సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు.

IND vs SA Series: త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. ఈ టూర్​లో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందులో భాగంగానే ఈ నెల 26న రెండు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ టెస్టు సిరీస్​కు 21 మందితో కూడిన జట్టును ప్రకటించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు. డీన్ ఎల్గర్ ఈ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

South Africa Test Squad: డీన్ ఎల్గర్ (కెప్టెన్), బవుమా, డికాక్, రబాడ, సరెల్ ఎర్వీ, బ్యూరాన్ హెండ్రిక్స్, జార్జ్ లిండే, కేశవ్ మాహారాజ్, లుంగీ ఎంగిడి, మర్క్​రమ్, వాయీన్ ముల్దర్, ఎన్రిచో నోర్జ్డే, కీగన్ పీటర్సన్, రస్సీ వాండర్ డసెన్, కైల్ వెర్రియన్నే, మార్కో జాన్సన్, గ్లెంటన్ స్టుర్మన్, ప్రినెలన్ సుబ్రయెన్, సిసండ మగాలా, ర్యాన్ రికెల్టన్, డ్యూనే ఒలివర్

IND vs SA Series 2021 Schedule: సోమవారం దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్​లో మార్పు చేశారు. ఇంతకుముందు ప్రకారం డిసెంబరు 17 నుంచి తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో టీమ్‌ఇండియా పర్యటన కాస్త ఆలస్యమయింది. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమ్ఇండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్‌పై నిర్ణయాన్ని తర్వాత వెల్లడిస్తామని బీసీసీఐ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.