ఆర్​సీబీ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. ఏబీ డివిలియర్స్​ కమ్​ బ్యాక్​

author img

By

Published : Nov 19, 2022, 4:02 PM IST

AB de Villiers

ఆర్​సీబీ జట్టు ఏబీ డివిలియర్స్​ గురించి అభిమానులకు శుభవార్త చెప్పింది. వచ్చే సీజన్​లో అతడు జట్టులోకి తిరిగి వస్తాడని తెలిపింది.

భారత్​లో జరిగే ఐపీఎల్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మ్యాచ్​కు ఉండే క్రేజే వేరు. ఐపీఎల్​ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎంతో అసక్తిగా ఎదురుచూస్తుంటారు క్రికెట్​ ప్రేమికులు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక మంచి సుభవార్త చెప్పింది. దక్షిణాఫ్రికా ​మాజీ లెజెండ్రీ క్రికెటర్​ ఏబీ డెవిలియర్స్​ మళ్లీ ఆ టీమ్​లో జాయిన్ అవుతున్నాడని కబురు చెప్పింది.​ అయితే మళ్లీ ఫ్రాంచైజీలో చేరతాడా! అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

"అబ్రహం బెంజమిన్ డివిలియర్స్ ఫరెవర్! గత సంవత్సరం..ఈ రోజున, కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని కలిగించిన వ్యక్తి, మా అభిమాన సూపర్ హీరో. అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ... అతడు త్వరలో బెంగళూరుకు తిరిగి వస్తాడు" అని ఆర్​సీబీ ట్వీట్ చేసింది.

కాగా, ఏబీ డివిలియర్స్ ఇటీవల బెంగళూరులో ఉండటం గమనార్హం. అయితే డెవిలియర్స్ మళ్లీ ఫ్రాంచైజీలో చేరతాడా! అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. డివిలియర్స్ కూడా RCB హాల్ ఆఫ్ ఫేమర్. అతడు 2011-2021 మధ్య 157 మ్యాచ్‌లలో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 41.10 సగటుతో 4,522 పరుగులు చేశాడు. 158 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ వద్ద రెండు సెంచరీలు, 37 అర్ధసెంచరీలు చేశాడు.

ప్రస్తుత జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ లోమ్, మోపాల్ శర్మ, మహిమల్ శర్మ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్.

ఇదీ చదవండి: ప్రపంచకప్​ ఎఫెక్ట్.. బీసీసీఐ కీలక నిర్ణయం.. జాతీయ సెలక్షన్ కమిటీపై వేటు

IPL 2023: మినీ వేలంలోకి కామెరూన్ గ్రీన్!​.. ఆసీస్ కెప్టెన్ ఏమన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.