ఐసీసీ ఛైర్మన్‌ పదవిపై గంగూలీ రియాక్షన్ ఇదే

author img

By

Published : Sep 22, 2022, 10:44 PM IST

icc chairman ganguly

ఐసీసీ ఛైర్మన్‌ పదవిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. అలాగే టీమ్‌ఇండియా సీనియర్‌ మహిళా క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి రిటైర్‌మెంట్‌పై కూడా మాట్లాడాడు. ఏం అన్నాడంటే..

ఐసీసీ ఛైర్మన్‌ పదవి రేసులో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అతడికి ఐసీసీ ఛైర్మన్‌ కుర్చీపై ఆసక్తిగా ఉన్నట్లు కథనాలు వచ్చాయి. తాజాగా దీనిపై స్వయంగా గంగూలీనే స్పందించాడు. "ఐసీసీ ఛైర్మన్‌షిప్‌ అనేది నా చేతుల్లో లేదు" అని వ్యాఖ్యానించాడు. కాగా, ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న గ్రెగ్ బార్‌క్లే పదవీ కాలం అక్టోబర్‌ చివరి నాటికి ముగిస్తుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రయ ప్రారంభం కానుంది. 16 మంది సభ్యులు కలిగిన బోర్డులో.. పోటీ పడే అభ్యర్థుల్లో ఎవరికి తొమ్మిది ఓట్లు వస్తాయో వారే విజేతలుగా నిలిచి ఛైర్మన్‌ అవుతారు. కొత్తగా ఎన్నికైన వారు డిసెంబర్‌ 1 నుంచి 2024 నవంబర్‌ 20వ తేదీ వరకు రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.

అలాగే టీమ్‌ఇండియా సీనియర్‌ మహిళా క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి రిటైర్‌మెంట్‌పై గంగూలీ మాట్లాడుతూ.. "ఝులన్‌ దిగ్గజ మహిళా క్రికెటర్‌. అద్భుతమైన కెరీర్‌కు ముగింపు ఇవ్వనుంది. భారత మహిళల క్రికెట్‌ చరిత్రలో ఝులన్ ప్రత్యేక గుర్తింపు పొందింది. యువతకు ఆదర్శంగా మారింది. ఆమె ఒక ఛాంపియన్‌" అని ప్రశంసించాడు.

ఇదీ చూడండి: బుమ్రా ఫిట్​నెస్​పై అప్డేట్​ ఇచ్చిన సూర్యకుమర్​.. ఏం చెప్పాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.