పంత్​ను కలిసిన యువీ.. సత్తా చాటేందుకు ఛాంపియన్​ రెడీ అంటూ పోస్ట్!

author img

By

Published : Mar 17, 2023, 10:35 AM IST

yuvraj with rishabh pant

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమ్​ఇండియా ప్లేయర్​ రిషభ్​ పంత్​ను ఇటీవలే మాజీ క్రికెటర్​ యువ్​రాజ్​ సింగ్​ కలిశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

గతేడాది డిసెంబర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయలపాలైన టీమ్​ఇండియా స్టార్​ క్రికెటర్​ రిషభ్ పంత్‌.. ప్రస్తుతం చికిత్స పొందుతూ​ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. శస్త్రచికిత్స అనంతరం బెడ్​కే పరిమితమైన పంత్​ ఆ తర్వాత కొద్ది కొద్దిగా కోలుకోవడం ప్రారంభించాడు. స్టిక్​ సహాయంతో ఇప్పుడిప్పుడే నడవడం కూడా మొదలుపెట్టాడు. అతడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానుల కోసం తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాడు. అయితే తాజాగా పంత్‌ను.. మాజీ క్రికెటర్​ యువ్​ రాజ్​ సింగ్​ను కలిశాడు.

ఈ క్రమంలో పంత్​ను పరామర్శించిన యువీ.. అతడితో కాసేపు ముచ్చటించాడు. "ఇప్పుడిప్పుడే అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఈ ఛాంపియన్‌ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు" అంటూ రిషభ్‌ పంత్‌తో దిగిన లేటెస్ట్​ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ క్రమంలో రిషబ్ ఆత్మవిశ్వాసాన్ని చూసి మురిసిపోయిన యువీ.. రిషభ్‌ ఎల్లప్పుడూ సరదాగా ఉంటాడని, నెగిటివ్​ ఆలోచనలు దరిచేరనీయడంటూ కొనియాడాడు. త్వరగా కోలుకుని తిరిగి మునపటిలా మారాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరలవుతోంది.

గాయాల కారణంగా రిషభ్‌ పంత్‌ పలు సిరీస్‌లతో పాటు ఐపీఎల్‌-2023 సీజన్​కు దూరమయ్యాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ కోసం అతడి స్థానంలో టీమ్​ఇండియా తరఫున ఆడేందుకు ఆంధ్ర వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్​ను రంగంలోకి దింపారు. ఇక ఐపీఎల్‌లో ప్రమాదానికి ముందు దిల్లీ క్యాపిటల్స్​కు పంత్​ సారథ్యం వహిస్తుండగా.. అతని స్థానంలో ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్​ బాధ్యతలు స్వీకరించాడు. మరోవైపు రానున్న వన్డే ప్రపంచకప్​కు కూడా పంత్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. అయితే ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్​ బ్యాటర్ల ర్యాంకింగ్స్​లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు రిషభ్ పంత్‌​. ప్రస్తుత ర్యాంకింగ్స్​లో అతడు తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు.

స్విమ్మింగ్​ పూల్​లో వాకింగ్​ చేస్తూ..
రోడ్డు ప్రమాదం తర్వాత నెమ్మదిగా కోలుకుంటున్న పంత్.. తన​ అభిమానుల కోసం వాకింగ్​ స్టిక్​ పట్టుకుని నడుస్తున్న ఫొటోలను ఇన్​స్టాలో షేర్​ చేశాడు. తాజాగా మరో వీడియోను కూడా షేర్​ చేశాడు. దాని కింద ఓ ఎమెషనల్​ నోట్​ రాసుకొచ్చాడు. అందులో నిండా నీళ్లు ఉన్న స్విమ్మింగ్​ పూల్​లో​ స్టిక్ సాయంతో నడుస్తూ కనిపించాడు. దీనిపై అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖలు స్పందించారు. ఈ అప్డేట్స్​ను చూసిన ఫ్యాన్స్​కు కాస్త ఊరట లభించినప్పటికీ.. అతను త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాలని ప్రార్థిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.