Ind vs Eng: భారత బౌలర్లు అదుర్స్.. ఇంగ్లాండ్​ ఆలౌట్​

author img

By

Published : Aug 4, 2021, 9:53 PM IST

Updated : Aug 4, 2021, 10:02 PM IST

Ind vs Eng

భారత బౌలర్లు అదరగొట్టారు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. టాస్​ గెలిచి బ్యాటింగ్​కు దిగిన రూట్​సేనను కేవలం 183 పరుగులకే ఆలౌట్ చేశారు.

భారత్​తో తొలి టెస్టులో ఇంగ్లాండ్​ తడబడింది. తొలి ఇన్నింగ్స్​లో కేవలం 183 పరుగులకే ఆలౌటైంది. టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా 4, షమి 3, శార్దుల్​ ఠాకుర్​ 2, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టారు. 64 పరుగులు చేసిన కెప్టెన్ జో రూట్​ ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్​లో టాప్​ స్కోరర్.

ఇంగ్లాండ్​ టపటపా..

138/4తో టీ విరామానికి వెళ్లిన ఇంగ్లాండ్​.. మరో 45 పరుగులకు చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. చివరి సెషన్​లో క్రమం తప్పకుండా బ్యాట్స్​మెన్​ ఔటయ్యారు. టీ విరామం తర్వాత అదే స్కోరు వద్ద లారెన్స్​ వికెట్​ను కోల్పోయింది. మరో ఏడు పరుగులకు బట్లర్​ పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే రూట్​ కూడా వెనుదిరిగాడు. ఆఖర్లో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్​.. ఆలౌట్​ కావడానికి ఎంతో సమయం పట్టలేదు.

Last Updated :Aug 4, 2021, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.