IND Vs ENG: ఐదో​ టెస్టు రద్దు దురదృష్టం: కోహ్లీ

author img

By

Published : Sep 13, 2021, 9:32 PM IST

Unfortunate we ended up in IPL early, hopefully we can maintain strong, bio-secure environment: Kohli

ఇంగ్లాండ్​తో(India Vs England 5th Test) ఐదో టెస్టు​ రద్దయిన తర్వాత టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ తొలిసారి మాట్లాడాడు. కరోనా కారణంగా మ్యాచ్​ జరగకపోవడం దురదృష్టకరమని అన్నాడు.

ఇంగ్లాండ్​తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దు(IND Vs ENG 5th Test Called Off) కావడంపై టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ(Kohli On Manchester Test) తొలిసారి స్పందించాడు. కరోనా వల్ల ఏర్పడిన అనిశ్చితి ఇందకు కారణమని అన్నాడు. ఇది చాలా దురదృష్టమని తెలిపాడు.

"దురదృష్టవశాత్తు ఇంగ్లాండ్​తో జరగాల్సిన ఐదో టెస్టు ఆడకుండానే ఇక్కడికి రావాల్సివచ్చింది. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనిశ్చితి నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరగొచ్చు. ఐపీఎల్​లోనైనా బలమైన, సురక్షితమైన వాతావరణం ఏర్పాటవుతుందని ఆశిస్తున్నాను. ఐపీఎల్​లో ఇప్పుడు మేం ఆడబోతున్నది చాలా కీలకం. ఆర్సీబీ జట్టుతో పాటు టీ20 ప్రపంచకప్​కు కావాల్సిన భారత ఆటగాళ్లకు ఇదెంతో ముఖ్యం".

- విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు.. ఐపీఎల్​ రెండోదశలో(IPL 2021 2nd Leg) కోల్​కతా నైట్​రైడర్స్​తో తమ మొదటి మ్యాచ్​ను సోమవారం(సెప్టెంబరు 20) ఆడనుంది.

Unfortunate we ended up in IPL early, hopefully we can maintain strong, bio-secure environment: Kohli
ఆర్సీబీ శిబిరంలో కెప్టెన్​ కోహ్లీ

ఐపీఎల్​ రెండోదశలో ఆర్సీబీ జట్టులో కొన్ని మార్పులు(RCB Team Changes) జరుగుతాయని కెప్టెన్​ విరాట్​ కోహ్లీ వెల్లడించాడు. లెగ్​-స్పిన్నర్​ వానిందు హసరంగ, సింగపూర్​కు చెందిన బ్యాట్స్​మన్​ టిమ్​ డేవిడ్​ జట్టులోకి చేరుతారని చెప్పాడు. జట్టులో కొన్ని మార్పులు జరగనున్నాయని.. ఆ మార్పులతో జట్టు మరింత ఫిట్​గా మారుతుందని భావిస్తున్నట్లు కోహ్లీ(RCB Captain) పేర్కొన్నాడు.

ఇదీ చూడండి.. భారత ఆటగాళ్లకు పాకిస్థాన్​లో ఘనమైన ఆతిథ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.