IND Vs ENG: ఐదో టెస్టు నిర్వహణపై త్వరలోనే స్పష్టత!

author img

By

Published : Sep 10, 2021, 3:44 PM IST

No question of forfeiting 5th Test, negotiations taking place on future course, says BCCI VP Shukla

మాంచెస్టర్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరగాల్సిన ఆఖరి టెస్టు(Manchester Test) రద్దు కావడంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్​ శుక్లా(BCCI Vice President) స్పందించారు. చివరి టెస్టును పూర్తిగా రద్దు చేయలేదని.. కరోనా నేపథ్యంలో ఈ మ్యాచ్​ను తిరిగి నిర్వహించాలనే దానిపై ఈసీబీతో కలిసి చర్చిస్తున్నామని తెలిపారు. మరోవైపు క్రికెటర్ల ఆరోగ్యం కంటే తమకు ఏదీ ఎక్కువ కాదని బీసీసీఐ(BCCI News) తేల్చి చెప్పింది.

ఇంగ్లాండ్​తో జరగాల్సిన ఆఖరి టెస్టు రద్దు కావడంపై భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI News) ఉపాధ్యక్షుడు రాజీవ్​ శుక్లా(BCCI Vice President) స్పందించారు. కరోనా కేసుల నేపథ్యంలో మ్యాచ్​ను ఇప్పటికైతై రద్దు చేసినట్లు తెలిపారు. అయితే ఇదే మ్యాచ్​ను తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలోనే స్పష్టత ఇస్తామని వెల్లడించారు.

"ఎన్నో సంప్రదింపుల తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్, జాయింట్​ సెక్రటరీ.. ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​, సీఈఓలతో పాటు ఇరుజట్ల కెప్టెన్లు సమావేశమై.. మాంచెస్టర్​ టెస్టును రద్దు చేయాలని నిర్ణయించాం. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇంగ్లాండ్​ బోర్డుతో స్నేహపూర్వకంగా చర్చిస్తున్నాం. కరోనా కేసుల నేపథ్యంలో ఆఖరి మ్యాచ్​ను ఆపేయాలనుకున్నాం కానీ, పూర్తిగా రద్దు చేసే అవకాశమే లేదు".

- రాజీవ్​ శుక్లా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు

అయితే భారత్​, ఇంగ్లాండ్​ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్టు(IND Vs ENG Test Series) తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే దానిపై రాజీవ్​ శుక్లా(Rajiv Shukla BCCI Vice President) స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం దానిపై చర్చ జరుగుతుందని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

మరోవైపు ఆటగాళ్ల ఆరోగ్యానికి మించి తమకు ఏదీ ఎక్కువ కాదని అంటోంది భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI news). "తమతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఐదో టెస్టు రీషెడ్యూల్​ చేసేందుకు ఇంగ్లాండ్​ బోర్డు అంగీకరించింది. దీనిపై పూర్తిగా చర్చించి.. ఇరుజట్లకు అనువైన సమయంలో మ్యాచ్​ను నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నాం" అని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇదీ చూడండి.. INDvsENG: భారత్-ఇంగ్లాండ్ చివరి టెస్టు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.