IND Vs ENG: నిమిషాల వ్యవధిలో మాట మార్చిన ఇంగ్లాండ్​ బోర్డు!

author img

By

Published : Sep 10, 2021, 5:31 PM IST

ECB revises its statement on 5th Test against India, removes reference to 'forfeit' by Team India

భారత్‌, ఇంగ్లాండ్‌(India vs England) మధ్య శుక్రవారం ప్రారంభం కావాల్సిన కొన్ని గంటల ముందు మ్యాచ్​ను(Manchester Test) రద్దు చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అప్పటివరకు భారత జట్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేదంటూ పరోక్షంగా వెల్లడించిన ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు(ECB News).. కొంత సమయం తర్వాత రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అలా ఈసీబీ వెంటవెంటనే తమ నిర్ణయాన్ని మార్చడానికి కారణం ఏంటనే దానిపై విశ్లేషకులు తెగ చర్చించుకుంటున్నారు. ఇంతకీ మ్యాచ్​కు ముందు ఏం జరిగింది? ఇరుజట్ల సమావేశంలో ఏం నిర్ణయించారు? ఈసీబీ, బీసీసీఐ చేసిన వేర్వేరు ప్రకటనలు ఏమిటి?

ఓవల్​ వేదికగా ఇంగ్లాండ్​తో(India Vs England) నాలుగో టెస్టు సందర్భంగా భారత కోచ్​ల బృందంలో కరోనా కేసులు(Corona in Indian Team) కలకలం రేపాయి. ఆ పరిస్థితుల్లో కోచ్​ల బృందం మినహా శిబిరంలోని వారందరూ కరోనా నెగెటివ్​ రావడం వల్ల ఆ మ్యాచ్​కు ఆటంకం కలగలేదు. అయితే ఐదో టెస్టుకు(IND Vs ENG 5th Test) ముందు జట్టులోని జూనియర్​ ఫిజియోకూ కొవిడ్​ సోకడం వల్ల మ్యాచ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

అంతకు ముందు భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI President) అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ స్పందిస్తూ.. చివరి మ్యాచ్​ నిర్వహణ అనుమానంగానే ఉందంటూ పేర్కొన్నాడు. అయితే గురువారం ఆటగాళ్లకు చేసిన కొవిడ్​ పరీక్షల్లో అందరికి కరోనా నెగెటివ్​ రావడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్టు నిర్వహణకు ఎలాంటి అడ్డులేదనే అంతా అనుకున్నారు.

అయితే మ్యాచ్​ జరగాల్సిన రోజు(శుక్రవారం) రానే వచ్చింది. ఏం జరిగిందో ఏమో కానీ మ్యాచ్​ రద్దు అని తొలుత ఈసీబీ(ECB News) ప్రకటించింది. ఆ తర్వాత ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యమంటూ బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. ఆ తర్వాత ఇరుజట్లు కలిసి చర్చించి.. ఐదో టెస్టును సరైన సమయంలో తిరిగి నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల క్రికెట్​ బోర్డుల మధ్య ఎలాంటి చర్చ జరిగిందనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే భారత్​, ఇంగ్లాండ్​ చివరి టెస్టుకు(Manchester Test) ముందుకు జరిగిన పరిణామాలను ఓసారి చర్చిద్దాం.

ఏం జరిగిందంటే?

ఈసీబీ తొలుత తమ అధికారిక వెబ్​సైట్​లో భారత్​ మ్యాచ్​ను వదిలేసుకుంది(Manchester Test Forfeit) అని పేర్కొంది. ఆ తర్వాత వెంటనే ఆ పదాన్ని తొలగించి.. 'టీమ్ఇండియా ఫీల్డింగ్​కు రాలేకపోతుంది' అంటూ రాసుకొచ్చింది. అయితే ఐదో టెస్టు గెలుపోటములపై మాత్రం ఈసీబీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఆటగాళ్ల ఆరోగ్యానికి మించి తామకు ఏదీ ఎక్కువ కాదని బీసీసీఐ తేల్చిచెప్పింది. ఆఖరి టెస్టు నిర్వహణపై ఈసీబీతో చర్చించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.

సిరీస్​ ఫలితం తేలేదెలా?

ఇంగ్లాండ్​తో జరుగుతున్న ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో టీమ్ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్​ను తిరిగి నిర్వహించేందుకు సమయం లేదని కొంతమంది క్రికెట్​ విశ్లేషకుల వాదన. ఒకవేళ ఈ మ్యాచ్​ జరగకపోతే.. సిరీస్​ ఫలితం ఎలా ఉండనుంది అనే దానిపై క్లారిటీ లేదు.

ఇదీ చూడండి.. IND Vs ENG: ఐదో టెస్టు నిర్వహణపై త్వరలోనే స్పష్టత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.