T10 Final: రసెల్​ విధ్వంసం.. తొలిసారి ట్రోఫీని ముద్దాడిన గ్లాడియేటర్స్​

author img

By

Published : Dec 5, 2021, 10:03 AM IST

Updated : Dec 5, 2021, 10:19 AM IST

రసెల్​ విధ్వంసం, అబుదాబి టీ10 లీగ్​ 2021, Deccan Gladiators ,Abu Dhabi T10

Abu Dhabi T10 league final: ఆండ్రీ రసెల్​ ధనాధన్​ ఇన్నింగ్స్​తో తొలిసారి అబుదాబి టీ10 ట్రోఫీని సొంతం చేసుకుంది డెక్కన్​ గ్లాడియేటర్స్​. ఫైనల్​లో దిల్లీ బుల్స్​ను 56 పరుగుల తేడాతో ఓడించింది.

Abu Dhabi T10 league 2021: డెక్కన్​ గ్లాడియేటర్స్​ తొలిసారి అబుదాబి టీ10 టైటిల్​ను ముద్దాడింది. ఈ సీజన్​ ఫైనల్​లో దిల్లీ బుల్స్​పై 56 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్​ గెలుపొందింది.

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ బుల్స్​ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులకే పరిమితమైంది. బ్యాటర్లలో చంద్రపాల్​ హేమ్​రాజ్​(42) టాప్​ స్కోరర్​గా నిలిచాడు. మిగతా వారు విఫలమైపోయారు. డెక్కన్​ బౌలర్లలో ఒడియన్​ స్మిత్ 2​, వనిందు హసరంగా 2, టైమల్​ మిల్స్ 2, ఆండ్రూ రసెల్​ ఓ వికెట్​ను దక్కించుకన్నారు.

రసెల్ వీరవిహారం..

అంతకుముందు టాస్ ​ఓడి బ్యాటింగ్​కు దిగిన డెక్కన్​లో ఓపెనర్లు రసెల్ (32 బంతుల్లో 90; 9X4, 7x6)​, కాడ్మోర్ ​(28 బంతుల్లో 59; 3x4, 5x6) ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడారు. వీరిద్దరూ కలిసి 159 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో నిర్ణీత ఓవర్లలో వికెట్​ నష్టపోకుండా 159 పరుగులు చేశారు. ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​ను వనిందు హసరంగా దక్కించుకున్నాడు.

ఇదీ చూడండి: భారత్ భళా.. కివీస్​పై భారీ అధిక్యం

Last Updated :Dec 5, 2021, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.