టీమ్ ఇండియా అభిమానికి సారీ చెప్పిన వార్నర్​.. ఎందుకంటే?

author img

By

Published : Sep 21, 2022, 7:35 AM IST

david warner

Ind vs Aus T20 2022 : మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో భాగంగా మొదటి భారత్​-ఆసీస్​ టీ20 మొహాలీ వేదికగా జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్​ హిట్టర్ డేవిడ్​ వార్నర్.. ఓ టీమ్ ఇండియా అభిమానికి సారీ చెప్పాడు. ఈ విషయం నెట్టింట వైరల్ మారింది.

వరల్డ్​ కప్​ ముందు జరుగుతున్న భారత్​-ఆసీస్​ సిరీస్​కు ఆస్ట్రేలియా స్టార్​ బ్యాటర్​ డేవిడ్ వార్నర్​ను దూరంగా ఉంచింది టీమ్​ మేనేజ్​మెంట్. అయితే మ్యాచ్​ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ టీమ్​ ఇండియా అభిమానికి సారీ చెప్పాడు వార్నర్. 'ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు?.. కమాన్​ ఆస్ట్రేలియా' అని కోహ్లీ ఉన్న ఫొటో ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు వార్నర్​. దీనికి ఓ టీమ్​ ఇండియా అభిమాని రిప్లై ఇస్తూ..' కెప్టెన్​ రోహిత్ శర్మ.. కోహ్లీ కాదు' చెప్పాడు. దీనికి స్పందించిన డేవిడ్ వార్నర్.. 'నాకు తెలుసు.. సారీ' అని సమాధానమిచ్చాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ మారింది. దీంతో వార్నర్​ స్వభావాన్ని అందరూ పొగుడుతున్నారు.

david warner said sorry to team india fan
.

అయితే ఈ మ్యాచ్​లో భారత్​ భారీ స్కోర్​ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో టీమ్​ ఇండియాపై విజయం సాధించింది ఆస్ట్రేలియా. భారత జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. జట్టు సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. కెమరూన్​ గ్రీన్​(61) టాప్ స్కోర్. స్మిత్​ (35) పర్వాలేదనిపించగా..​ చివర్లో మ్యాథ్యూ వేడ్(45)​ బాగా రాణించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్​ 3, ఉమేశ్​ యాదవ్​ 2, చాహల్​ ఓ వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ దిగిన భారత బ్యాటర్లు బాగానే ఆడారు. నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి జట్టు 208 పరుగులు చేసింది. దీంతో ఆసీస్​కు 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హార్దిక్ పాండ్య(71)​, కేఎల్ రాహుల్​(55) అర్ధశతకాలు సాధించారు. సూర్యకుమార్ యాదవ్​(46) రాణించాడు. ఆసీస్​ బౌరల్లలో నాథన్​ ఎల్లిస్​ 3, హేజిల్​వుడ్​ 2, గ్రీన్​ ఓ వికెట్​ తీశారు.

ఇవీ చదవండి: IND VS AUS: తొలి టీ20లో ఆసీస్​దే విజయం

ఆ షాట్​ కొట్టి ఔటైతే చాలా బాధగా ఉంటుంది: కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.