'ప్లేయర్​ ఆఫ్ ది మంత్'​ రేసులో పాక్​​ హిట్టర్​

author img

By

Published : Nov 4, 2021, 3:09 PM IST

icc player of the month

అక్టోబరు నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్' (icc player of the month) నామినేషన్లను ప్రకటించింది ఐసీసీ (ICC News). ఈ జాబితాలో తలో ముగ్గురు పురుష, మహిళా క్రికెటర్లు ఉన్నారు.

అక్టోబర్ నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్'​ (ICC Player Of The Month) జాబితాను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC). ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభించింది ఐసీసీ (ICC News). అందులో భాగంగానే అక్టోబర్ నెల (ICC Player Of The Month October 2021) కోసం టాప్ ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది.

టీ20 ప్రపంచకప్​లో భాగంగా అత్యుత్తమ బ్యాటింగ్ నైపుణ్యం కనబరిచిన పాకిస్థాన్​ ఆటగాడు అసిఫ్ అలీకి (Asif Ali News) ఈ ఐసీసీ విడుదల చేసిన జాబితాలో చోటు దక్కింది. ఇతడితో పాటు బంగ్లాదేశ్ ఆల్​రౌండర్ (Shakib Al Hasan News) షకిబ్ అల్ హసన్, నమీబియా ఆటగాడు డేవిడ్ వైస్​కు స్థానం లభించింది.

మహిళా క్రికెటర్లలో ఐర్లాండ్ ఆల్​రౌండర్ లారా దిలానీ, బ్యాటర్ గాబీ లెవిస్, జింబాబ్వే కెప్టెన్, ఆల్​రౌండర్ మేరీ అన్నె ముసోండా.. 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్'కు నామినేట్ అయ్యారు.

ఇదీ చూడండి: T20 worldcup: పాకిస్థాన్‌ హ్యాట్రిక్.. అఫ్గానిస్థాన్​పై విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.