అన్ని ఫార్మాట్లకు డివిలియర్స్ గుడ్​ బై.. ఆర్సీబీ ఫ్యాన్స్​కు నిరాశ

author img

By

Published : Nov 19, 2021, 1:11 PM IST

Updated : Nov 19, 2021, 1:49 PM IST

ab  devilliers

దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్(De villiers retirement) క్రికెట్ అభిమానులకు షాకిచ్చాడు. క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లకు దూరం కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్(AB De Villiers retirement)​ క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2018 మే నెలలో దక్షిణాఫ్రికా జట్టుకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఏబీ(De villiers news).. ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడలేదు. ఐపీఎల్​లో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చాడు. ప్రస్తుత నిర్ణయంతో ఆర్సీబీ నుంచి కూడా దూరం కానున్నాడు.

"క్రికెట్​లోని అన్ని ఫార్మాట్​లకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్​ను నేను ఎంజాయ్ చేశాను. ఇక 37 ఏళ్ల వయసు వచ్చేసింది కదా అందుకే రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాను"

-- ఏబీ డివిలియర్స్, మాజీ క్రికెటర్.

2018లో దక్షిణాఫ్రికా తరఫున చివరి పరిమిత ఓవర్ల మ్యాచ్​ ఆడాడు డివిలియర్స్. ఐపీఎల్​లో ఆర్సీబీ తరఫున 184 మ్యాచ్​ల్లో ప్రాతినిథ్యం వహించాడు.

  • It has been an incredible journey, but I have decided to retire from all cricket.

    Ever since the back yard matches with my older brothers, I have played the game with pure enjoyment and unbridled enthusiasm. Now, at the age of 37, that flame no longer burns so brightly. pic.twitter.com/W1Z41wFeli

    — AB de Villiers (@ABdeVilliers17) November 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటివరకు 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు డివిలియర్స్.

ఇదీ చదవండి:

'రోహిత్, కోహ్లీ, రాహుల్​ను పక్కనపెట్టడం కష్టమే'

Last Updated :Nov 19, 2021, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.